సెప్టెంబరులో ఆహార ధరలు తగ్గాయి!

ABN , First Publish Date - 2021-10-13T02:15:34+05:30 IST

ఆహారం ధరలు తగ్గడంతో సెప్టెంబరులో రిటెయిల్ ద్రవ్యోల్బణం

సెప్టెంబరులో ఆహార ధరలు తగ్గాయి!

న్యూఢిల్లీ : ఆహారం ధరలు తగ్గడంతో సెప్టెంబరులో రిటెయిల్ ద్రవ్యోల్బణం బాగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రిటెయిల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 5.30 శాతం కాగా, సెప్టెంబరులో 4.35 శాతానికి తగ్గిందని తెలిపింది. ఆహారం ధరలు ఆగస్టులో 3.11 శాతం స్థాయిలో ఉండగా, సెప్టెంబరులో 0.68 శాతం స్థాయికి తగ్గినట్లు పేర్కొంది. గుడ్లు, మాంసం, చేపలు, పండ్లు, కూరగాయల ధరలు సెప్టెంబరులో బాగా తగ్గినట్లు తెలిపింది. 


వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ప్రకారం 2020 సెప్టెంబరునాటి రిటెయిల్ ద్రవ్యోల్బణం 7.27 శాతం ఉండేది. ఈ ఏడాది సెప్టెంబరులో ఇది 4.35 శాతానికి తగ్గింది. ఆహార ద్రవ్యోల్బణం 2020 సెప్టెంబరులో 10.68 శాతం ఉండేది. ఈ ఏడాది సెప్టెంబరులో 0.68 శాతం స్థాయికి తగ్గింది. 


సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలో 6 శాతం కన్నా తక్కువగా నమోదైంది. ఇది 2021 జూలైలో 5.59 శాతం, ఆగస్టులో 5.30 శాతం, సెప్టెంబరులో 4.35 శాతం నమోదైంది. 


Updated Date - 2021-10-13T02:15:34+05:30 IST