కోబ్రా కమాండో రాకేశ్‌తో మాట్లాడిన అమిత్ షా

ABN , First Publish Date - 2021-04-09T04:11:01+05:30 IST

న్యూఢిల్లీ: మావోయిస్టులు బందీగా చేసుకుని విడుదల చేసిన కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు.

కోబ్రా కమాండో రాకేశ్‌తో మాట్లాడిన అమిత్ షా

న్యూఢిల్లీ: మావోయిస్టులు బందీగా చేసుకుని విడుదల చేసిన కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. ఫోన్ ద్వారా మాట్లాడిన ఆయన రాకేశ్ ఆరోగ్యం‌ గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న తెర్రం పోలీస్‌స్టేషన్ పరిధిలో రాకేశ్వర్‌సింగ్‌ను మావోలు వదిలిపెట్టారు. ఆ తర్వాత ఆయన్ను బీజాపూర్‌లోని సీఆర్‌ఫీఎఫ్ క్యాంపుకు తరలించారు. అక్కడే రాకేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 23 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న మావోయిస్టులు ఎన్‌కౌంటర్ తర్వాత రాకేశ్వర్‌సింగ్‌ను బందీ పట్టుకున్నారు. జవాన్ తమవద్ద క్షేమంగా ఉన్నాడని, చర్చలకు ప్రతినిధి బృందాన్ని పంపితే విడుదల చేస్తామని మావోలు అధికారిక ప్రకటన చేశారు. ఆ తర్వాత రాకేశ్వర్‌సింగ్‌ను వదిలిపెట్టారు. 



Updated Date - 2021-04-09T04:11:01+05:30 IST