కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-08-02T22:32:25+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. చికిత్స నిమిత్తం...

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. చికిత్స నిమిత్తం ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని, రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్‌లో తెలిపారు. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన సూచించారు.


బాల గంగాధర తిలక్ 100వ వర్థంతి సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించిన వెబినార్ ప్రారంభ సమావేశంలో అమిత్ షా శనివారం పాల్గొన్నారు. దీంతో.. ఆ సమావేశంలో పాల్గొన్న వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.



Updated Date - 2020-08-02T22:32:25+05:30 IST