మీ కుమారుడిని పునరావాస కేంద్రానికి పంపండి..Shah Rukh Khanకు కేంద్రమంత్రి సలహా
ABN , First Publish Date - 2021-10-25T14:27:59+05:30 IST
డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్‌ను పునరావాస కేంద్రానికి పంపాలని బాలీవుడ్ నటుడు....
ముంబై: డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్‌ను పునరావాస కేంద్రానికి పంపాలని బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్‌కు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే సూచించారు.‘‘చిన్న వయసులో డ్రగ్స్ తీసుకోవడం మంచిది కాదు. ఆర్యన్ ఖాన్‌కు భవిష్యత్తు ఉంది. ఆర్యన్ ఖాన్‌ను మినిస్ట్రీకి సంబంధించిన డి-అడిక్షన్ రిహాబిలిటేషన్ సెంటర్‌కి పంపమని నేను షారుఖ్ ఖాన్‌కు సలహా ఇస్తున్నాను. అతను 1-2 నెలలు అక్కడ ఉండాలి, అతడిని జైల్లో ఉంచకుండా.. దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు చాలానే ఉన్నాయి.. ఒకటి రెండు నెలల్లో డ్రగ్స్ వ్యసనం నుంచి విముక్తి పొందుతాడు’’అని కేంద్ర మంత్రి రాందాస్ పేర్కొన్నారు.క్రూయిజ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు చేసినందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను కేంద్రమంత్రి అథవాలే ప్రశంసించారు.