Abn logo
Oct 27 2021 @ 20:01PM

కేంద్ర మంత్రులు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి: హరీష్‌రావు

జమ్మికుంట: కేంద్ర మంత్రులు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. బుధవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. దళితులకు దళితబంధు ఇచ్చింది సీఎం కేసీఆరే అన్నారు. రైతులకు వడ్డీతో సహా లక్ష వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. హుజూరాబాద్‌లో ఐదు వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని, సొంత జాగలో ఇల్లు కట్టుకుంటే 5.04 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఈ నెల 30 తర్వాత గ్యాస్‌ ధర 200 రూపాయలు కేంద్రం పెంచుతుందన్నారు. వడ్లు కొనమని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, ఊరురా వడ్లు కొనుగోలు చేయడానికి కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామని హరీష్‌రావు గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption