Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆందోళన బాటలో ఉద్యోగ సంఘాలు

అమరావతి: ఏపీలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. త్వరలో ఏపీ జేఏసీ అమరావతి, ఎన్జీవో జేఏసీ ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ వెల్లడించనున్నాయి. ఉద్యమం తప్పదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఉద్యమంపై కాసేపట్లో ఉమ్మడి కార్యాచరణ ప్రకటించనున్నాయి. ఏపీలో కొంత కాలంగా పీఆర్సీతో పాటుగా పెండింగ్ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్టోబర్ నెలాఖరు నాటికే పీఆర్సీపై స్పష్టత ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. 

Advertisement
Advertisement