రాజ్యాంగంపై ప్రమాణం చేసి వధూవరుల వినూత్న వివాహం

ABN , First Publish Date - 2020-02-17T13:32:57+05:30 IST

హిందూ ధర్మాన్ని వదిలి భారత రాజ్యాంగంపై అచంచల విశ్వాసంతో రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ వధూవరులు వినూత్న వివాహం చేసుకున్న ఘటన....

రాజ్యాంగంపై ప్రమాణం చేసి వధూవరుల వినూత్న వివాహం

భోపాల్ (మధ్యప్రదేశ్): హిందూ ధర్మాన్ని వదిలి భారత రాజ్యాంగంపై అచంచల విశ్వాసంతో రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ వధూవరులు వినూత్న వివాహం చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెహోరి నగరంలో వెలుగుచూసింది. సెహోరి నగరానికి చెందిన వధూవరులు భాజాభజంత్రీల మధ్య ప్రజలు వెంటరాగా ఊరేగింపుగా పెళ్లి మండపానికి తరలివచ్చారు. అనంతరం వధూవరులు అతిధుల మధ్య భారత రాజ్యాంగం చదువుతూ దానిపై ప్రమాణం చేస్తూ ఒక్కటయ్యారు. వధూవరులతోపాటు పెళ్లికి వచ్చిన అతిధులు కూడా రాజ్యాంగాన్ని పఠించారు. ఈ వినూత్న వివాహం చేసుకున్న వధూవరులను పలువురు అభినందించారు.

Updated Date - 2020-02-17T13:32:57+05:30 IST