‘ఇంజనీరింగ్‌ డిగ్రీల’పై వర్సిటీలదే నిర్ణయం

ABN , First Publish Date - 2020-08-15T07:49:45+05:30 IST

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీల నియామకానికి అర్హమైన ఇంజనీరింగ్‌ డిగ్రీలు, వాటి ప్రామాణికతకు సంబంధించిన ఏ అంశమైనా రాష్ట్ర లేదా యూనివర్సిటీ స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాలని ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ) తెలిపింది...

‘ఇంజనీరింగ్‌ డిగ్రీల’పై వర్సిటీలదే నిర్ణయం

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీల నియామకానికి అర్హమైన ఇంజనీరింగ్‌ డిగ్రీలు, వాటి ప్రామాణికతకు సంబంధించిన ఏ అంశమైనా రాష్ట్ర లేదా యూనివర్సిటీ స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాలని ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ) తెలిపింది. వివిధ ఇంజనీరింగ్‌ లేదా తత్సమానమైన డిగ్రీలపై సాంకేతిక విద్యా శాఖకు అనేక ఫిర్యాదులు వస్తున్నట్లు పేర్కొంది. ఇంజనీరింగ్‌ డిగ్రీలు లేదా తత్సమాన అర్హతలకు సంబంధించి ఏఐసీటీఈ ఆమోదించిన జాబితా మేరకే అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల నియామకాలు, ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టాలని కౌన్సిల్‌ స్పష్టం చేసింది.

Updated Date - 2020-08-15T07:49:45+05:30 IST