చీమలకు అంత సీన్ ఉందా?

ABN , First Publish Date - 2020-10-23T00:45:43+05:30 IST

భూమిపై ఉండే జీవరాశుల్లో 15 నుంచి 20 శాతం చీమలే ఉంటాయని అంచనా. ఇవి కూడా మనుషుల్లాగా సాంఘిక జీవితం సాగిస్తూ ఉంటాయి. కలిసి మెలిసి ఉంటూ వాటికంటూ...

చీమలకు అంత సీన్ ఉందా?

భూమిపై ఉండే జీవరాశుల్లో 15 నుంచి 20 శాతం చీమలే ఉంటాయని అంచనా. ఇవి కూడా మనుషుల్లాగా సాంఘిక జీవితం సాగిస్తూ ఉంటాయి. కలిసి మెలిసి ఉంటూ వాటికంటూ ఓ గూడు ఏర్పాటు చేసుకుంటాయి. అతి తక్కువ స్థలంలో పెద్ద సంఖ్యలో గుమి గూడుతూ ఉంటాయి. అయితే అంటు వ్యాధులు వచ్చినప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాయి. అయితే అంటు వ్యాధులు వచ్చినప్పుడు ముందస్తు జాగ్రత్తగా కఠినమైన చర్యలు తీసుకుంటాయి. ఆ సమయంలో చీమల సమూహం వ్యవహరించే తీరులో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. చీమలు భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటిస్తాయట. పరిశోధనల్లో భాగంగా పరిశోధకులు 11 చీమలపై వ్యాధి కారకాలను వదిలారు. 


Updated Date - 2020-10-23T00:45:43+05:30 IST