Oct 2 2021 @ 22:04PM

భయపడ్డ సమంత..! అందుకే అలా చేసిందా..?

‘ఏమాయ చేశావే’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ జంట.. ఆ సినిమాతోనే ప్రేమలో పడ్డారు. ఇక చాలా కాలం ప్రేమలో మునిగి తేలిన వీళ్లు 2017 వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత కూడా వాళ్లిద్దరూ జంటగా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. సమంత, నాగ చైతన్యల విడాకులపై గత నెల నుంచి వస్తున్న రూమర్లను నిజం చేస్తూ ఆ ఇద్దరు అధికారికంగా ప్రకటన చేశారు. తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించేశారు. భార్యభర్తలుగా విడిపోయినా కూడా తామిద్దరం స్నేహితుల్లాగా ఉంటామని క్లారిటీ ఇచ్చారు. తమ బంధం ఏర్పడటానికి కారణం కూడా స్నేహమేనని, ఆ బంధం ఎప్పటికీ అలా ఉంటుందని వారిద్దరూ పేర్కొన్నారు. 

సమంత తన విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ చేసిన అఫీషియల్ నోట్ కింద కామెంట్ల సెక్షన్లు క్లోజ్ చేసేసింది. మామూలుగా అయితే సమంత తన కామెంట్ల సెక్షన్లు క్లోజ్ చేయదు. ఎప్పుడో ఒక సారి నెగిటివ్ ట్రెండ్ సమయంలోనే అలా చేస్తుంటుంది. అయితే ఈ విడాకుల  విషయంలో కచ్చితంగా నెగిటివ్ కామెంట్లు వస్తాయని ముందే ఆలోచించినట్టు కనిపిస్తోంది. అందుకే సమంత తన పోస్టుకు కామెంట్లను డిజుబుల్ చేసేసింది. అయితే ఈ పోస్టుకు మాత్రం విపరీతమైన లైకులు వస్తున్నాయి. అంటే సమంత విడాకులు తీసుకోవాలని చాలా మంది ఎదురుచూస్తున్నారా?. లేదా?. సమంత, నాగచైతన్యలు విడిపోయినా కూడా స్నేహితుల్లా ఉంటామని చెప్పినందుకు అలా లైకులు కొడుతున్నారా?. లేక అసలు మేటర్ చదవకుండానే లైకులు కొడుతున్నారా?. అనే దానిపై క్లారిటీ లేదు.