ఇన్‌స్టాగ్రామ్‌లో యువతిని ట్రాప్‌ చేసి...

ABN , First Publish Date - 2021-07-03T14:38:36+05:30 IST

ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. త్వరలోనే పెళ్లి చేసుకుందామంటూ యువతిని నమ్మించి...

ఇన్‌స్టాగ్రామ్‌లో యువతిని ట్రాప్‌ చేసి...

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : ఇన్‌స్టాగ్రామ్‌లో యువతిని ట్రాప్‌ చేసిన కేటుగాడు రూ. లక్షకు పైగా ఆమె నుంచికాజేశాడు. చాదర్‌ఘాట్‌కు చెందిన యువతి నయనలోనాకు మైఖేల్‌ ఫ్రాంక్లిన్‌ అనే ఆగంతకుడు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. త్వరలోనే పెళ్లి చేసుకుందామంటూ యువతిని నమ్మించిన ఫ్రాంక్లిన్‌ ప్రేమకు గుర్తుగా అత్యంత ఖరీదైన గిఫ్ట్‌ను ఎయిర్‌ కొరియర్‌ ద్వారా పంపిస్తున్నానని చెప్పాడు.


ఆ తర్వాత రెండు రోజులకు ఆమెకు ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. తాము హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ నుంచిమాట్లాడుతున్నామని ట్యాక్సులు, ఫైన్‌ కలిపి రూ.2లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లిస్తేనే మీకు వచ్చిన గిఫ్ట్‌ను పంపిస్తామని చెప్పారు. దీంతో తన వద్ద ఉన్నఫలంగా అంత డబ్బులేదని చెప్పిన యువతి రూ.లక్షా ఇరవైవేలు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఆ తర్వాత తనకు ఫోన్‌ వచ్చిన నెంబర్‌ స్విచ్చాఫ్‌ రావడం, మైఖేల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా కూడా బ్లాక్‌ కావడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు సిటీ సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది.

Updated Date - 2021-07-03T14:38:36+05:30 IST