Abn logo
Sep 8 2020 @ 08:20AM

21 నుంచి తొమ్మిదో తరగతి దాటిన విద్యార్థులకు తరగతులు

Kaakateeya

పట్నా: బీహార్‌లో కరోనా కేసులు అంతకంతకూ విజృంభిస్తున్నాయి. అయితే ఇప్పుడు కొన్ని నిబంధనలతో దుకాణాలు మొదలైనవాటిని తెరిచేందుకు అనుమతులు ఇచ్చారు. దీని గురించి డీఎం మాట్లాడుతూ దుకాణాలను కరోనా నిబంధనలకు అనుగుణంగా తెరవడంలేదని, దుకాణాల యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, అటువంటివారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్కూళ్లు, కాలేజీలు, శిక్షణ సంస్థలు, కోచింగ్ సెంటర్లు మొదలైనవన్నీ సెప్టెంబరు 30 వరకూ మూసివేసి ఉంచనున్నారు. 


అయితే అన్‌లైన్ తరగతులకు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌కు అనుమతించారని తెలిపారు. 50 శాతం ఉపాధ్యాయులు, సిబ్బందితో ఈ నెల 21 నుంచి పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు, టెలీ కౌన్సెలింగ్ సంబంధిత కార్యక్రమాలు నిర్వహించవచ్చన్నారు. అలాగే 9 వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదివే విద్యార్థులు కొన్ని నిబంధనలతో విద్యాసంస్థలకు హాజరయ్యేందుకు అనుమతి ఉందన్నారు. అలాగే సెప్టెంబరు 21 నుంచి వివాహాది వేడుకలను వంద మంది పరిమితితో నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతించిదని తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement