అన్‌లాక్‌... అయినా జాగ్రత్త!

ABN , First Publish Date - 2021-06-20T05:53:16+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. శనివారం హై దరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

అన్‌లాక్‌... అయినా జాగ్రత్త!

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం
మరికొంత కాలం నిబంధనలు పాటించాలంటున్న వైద్య నిపుణులు
నేటి నుంచి జిల్లాలో యథావిధిగా కొనసాగనున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు

నిజామాబాద్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి ప్రతినిధి):  రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. శనివారం హై దరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. క రోనా తీవ్రత తగ్గడంతో కేబినెట్‌ ఈ మేరకు లాక్‌డౌన్‌ను ఎ త్తివేసింది. అయితే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచి ంచింది. థర్డ్‌వేవ్‌ ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని వైద్య నిపుణులు కోరుతు న్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వ్యాప్తి పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
సెకండ్‌ వేవ్‌లో జిల్లాపై ‘మహా’ ప్రభావం
జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం మార్చి రెండో వా రంలో మొదలైంది. మహారాష్ట్ర నుంచి జిల్లాకు రాకపోకలు ఎక్కువగా ఉండడంతో జిల్లాలో వ్యాప్తి పెరిగింది. ఏప్రిల్‌ నె లలో జిల్లాలో ఊహించని రీతిలో తీవ్రత పెరిగి ఆసుపత్రుల లో బెడ్లు సరిపోని పరిస్థితి ఎదురైంది. జిల్లాకు చెందిఇన పలువురు కరోనా బాధితులు ప్రైవేటుకు వెళ్లి లక్షల రూపా యలు చికిత్స కోసం ఖర్చు చేశారు. మే నెల మూడో వారం వరకు తీవ్రత కొనసాగినా.. ఆ తర్వాత కేసులు తగ్గుతూ వ స్తున్నాయి. జూన్‌ రెండో వారం నుంచి కేసుల సంఖ్య భారీ గా తగ్గింది. జిల్లాలో ప్రతీరోజు పరీక్షలు నిర్వహించినా కేసు ల సంఖ్య ఇరవైలోపే ఉంటోంది. జిల్లాలో సెకండ్‌ వేవ్‌ మొ దలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,11,850 మందికి పరీక్షలు నిర్వహించగా.. 36,414 మందికి పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలో ప్రస్తుతం 1,050 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  ప్రభు త్వ జనరల్‌ ఆసుపత్రిలో సెకండ్‌ వేవ్‌ ఆరంభం నుంచి 3,40 5 మందికి చికిత్స అందించారు. ప్రస్తుతం 105 మంది ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లాక్‌డౌన్‌లో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితం కావడం వల్ల వ్యాప్తి తగ్గింది.
అప్రమత్తత తప్పనిసరి
రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసినప్పటికీ ప్రతిఒక్క రూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నా రు. కరోనా తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గలేదని వారంటున్నా రు. నిబంధనలు పాటిస్తూ బయటకు రావాలని కోరుతున్నా రు. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని, శాని టైజర్లు ఉపయోగించాలని కోరుతున్నారు. ప్రజలు ఏమాత్ర ం అజాగ్రత్తగా ఉన్నా కేసులు పెరుగుతాయని తెలిపారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో చాలా మంది ఇబ్బందులు పడ్డార ని జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమరాజ్‌ తెలిపారు. కరోనా కేసులు తగ్గినా అప్రమత్తంగా ఉండాల న్నారు. థర్డ్‌వేవ్‌ ఉంటుందన్న నేపథ్యంలో జిల్లా ప్రజలు మ రింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. జిల్లాలోని ప్రజలు బ యటకు వెళ్లేటప్పుడు తప్పనిసరి మాస్క్‌ ధరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బాల నరేంద్ర తెలిపారు. జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తి తగ్గినా మళ్లీ అందరూ బయటకు వ చ్చి నిబంధనలు పాటించకుంటే పెరుగుతుందని తెలిపారు. వివిధ రంగాలలో పనిచేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవా లని ఆయన సూచించారు.

Updated Date - 2021-06-20T05:53:16+05:30 IST