ముంబైలో మాస్కులు ధరించకుంటే బేడీలే

ABN , First Publish Date - 2020-04-09T08:21:25+05:30 IST

మాస్కులను ధరించని వారిని అరెస్టు చేస్తామని ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) హెచ్చరించింది. ఇంటి నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని...

ముంబైలో మాస్కులు ధరించకుంటే బేడీలే

ముంబై/జమ్మూ, ఏప్రిల్‌ 8: మాస్కులను ధరించని వారిని అరెస్టు చేస్తామని ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) హెచ్చరించింది. ఇంటి నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశించింది. అది ఇంట్లో తయారు చేసుకున్న మాస్క్‌ అయినా ఫర్వాలేదని పేర్కొంది. ఈ మేరకు బుధవారం  ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు కొన్ని గంటల ముందే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే కరోనా మహమ్మారిని దూరం చేసేందుకు ప్రజలంతా మాస్కులను ధరించాలని కోరారు. కాగా.. జమ్మూకశ్మీర్‌లోని సచివాలయంలో కూడా మాస్కులను ధరించడం తప్పనిసరి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ బయటకు వచ్చే పౌరులు మాస్కులను ధరించడం తప్పనిసరి చేశారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి సర్కారు కూడా మాస్కులు ధరించకుండా బయటకు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-04-09T08:21:25+05:30 IST