ఉపాధి కూలీలకు చెల్లించని కూలి డబ్బులు

ABN , First Publish Date - 2021-08-03T07:01:55+05:30 IST

పనులు చేసి నెల లు గడుస్తున్నా కూలీలకు కూలి డబ్బులు అందటం లేదు. గతంలో ఒక వారం పని చేస్తే రెండోవారంలో ఖాతాలకు నగదు జమ చేసేవారు

ఉపాధి కూలీలకు చెల్లించని కూలి డబ్బులు
కురుగుంట సమీపంలో పనులు చేస్తున్న కూలీలు(ఫైల్‌)


రెండు నెలలుగా అందని బిల్లులు

పెండింగ్‌లో రూ.1.73 కోట్లు

అప్పులతో అవసరాలు తీర్చుకుంటున్న కూలీలు 

అనంతపురంరూరల్‌, ఆగస్టు 2: పనులు చేసి నెల లు గడుస్తున్నా కూలీలకు కూలి డబ్బులు అందటం లేదు. గతంలో ఒక వారం పని చేస్తే రెండోవారంలో ఖాతాలకు నగదు జమ చేసేవారు. ప్రస్తుతం ఏడు ఎనిమిది వారాలు గడిచిన కూలి మాత్రం ఖాతాల్లోకి జమకావడం లేదు. దీంతో ఉపాధి కూలీలు ఆందోళన చెందుతున్నారు.  రెండు నెలలుగా కూలి బిల్లులు మంజూరు కా కపోవడంతో ఉపాధి కూలీలు అప్పులు చేస్తూ అవసరాలను తీర్చుకుంటున్నారు. బిల్లుల చెల్లింపులపై సంబంధిత అధికారు లు పట్టించుకోకపోవడం కూలీలకు శాపంగా మారింది. 


పెండింగ్‌లో రూ.1.73 కోట్లు

అనంతపురం రూరల్‌ మండలంలో 26 పంచాయతీలున్నాయి. ఇందులో అర్బన్‌ నియోజకవర్గ పరిధిలోని అనం తపురం రూరల్‌ పంచాయతీ, రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని కక్కలపల్లి కాలనీ పంచాయతీలో తప్ప మిగిలిన అన్ని పంచాయతీల్లో కూలీలకు ఉపాధి బిల్లులు పడాల్సి ఉంది. రెండు నెలలుగా 3 వేల మందికిపైగా కూలీలకు రూ.1.73కోట్లు పెండింగ్‌లో ఉంది. అత్యధికంగా కందుకూ రు గ్రామంలో రూ. 26,51,426 పెండింగ్‌లో ఉంది ఆ తరువాత ఆలమూరులో రూ.19,89,702, కామారుపల్లిలో రూ.14,88,436, పూలకుంట రూ.14,56,289, చియ్యేడు రూ.13,14,581, ఉప్పరపల్లిలో 12,04,672 లక్షల చొప్పున బిల్లులు కూలీలకు రావాల్సి ఉంది. అలాగే అక్కంపల్లి రూ.6.14లక్షలు, ఆకుతోటపల్లి రూ.5.96లక్షలు చిన్నంపల్లి రూ.4.87లక్షలు, ఇటుకలపల్లి రూ. 5.46లక్షలు, కక్కలపల్లి రూ. 3.27లక్షలు, కాటిగానికాలువ రూ.3.96లక్షలు, కట్టకిందపల్లి 5.42లక్షలు, కొడిమి రూ.4. 76లక్షలు, కురుగుంట రూ.5.95లక్షలు, మన్నీల రూ.6.76లక్షలు, రాచానపల్లి రూ.2.83లక్షలు, రాజీవ్‌ కాలనీ రూ. 2.13లక్షలు, సోములదొడ్డి రూ. 5.61లక్షలు, తాటిచెర్ల రూ.7.45లక్షలు, నర్సనేకుంట రూ.71వేలు, ఎ.నారాయణపురంలో రూ.80వేలు చొ ప్పున కూలీలకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 


త్వరలో బిల్లులు పడతాయి..చంద్రకళ, ఏపీఓ

బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయం వాస్తవమే. ఎని మిది వారాలుగా కూలీలకు బిల్లులు రావాల్సి ఉంది. రెం డు వారాలకు సంబంధించిన బిల్లులు మంజూరయ్యాయి.  సంబంధిత అధికారులను బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరాం. త్వరలోనే కూలీల ఖాతాల్లోకి జమ అవుతాయి. 


Updated Date - 2021-08-03T07:01:55+05:30 IST