ఐదు నెలలుగా కార్మికులకు అందని జీతాలు

ABN , First Publish Date - 2021-08-03T14:28:08+05:30 IST

ముఖ్యమంత్రి నివాసం ఉండే..

ఐదు నెలలుగా కార్మికులకు అందని జీతాలు

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌


నరసరావుపేట టౌన్‌: ముఖ్యమంత్రి నివాసం ఉండే, పరిపాలన రాజధాని అని చెప్పుకొనే మంగళగిరి, తాడేపల్లి కార్పొరే షన్‌లో ఐదు నెలలుగా కార్మి కులకు, ఉద్యోగులకు జీతాలు లేవని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ ఆహ్మద్‌ అన్నారు. సోమవారం పట్టణంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ముజఫర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే దారుణమైన పద్దతుల్లో కార్మికులపై తీవ్ర నిర్భంధాన్ని అణచివేతను జగన్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తుందని, ఇదే పద్దతి కొనసాగితే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు.  సీఐటీయూ తూర్పు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ ఆందోళన చేస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టడం దుర్మార్గమని, వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీ మున్సిపల్‌ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు జరిగింది. ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో రైతు సంఘం పశ్చిమ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గద్దె చలమయ్య, కౌలు రైతు సంఘం పశ్చిమ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కామినేని రామారావు, వై.రాధాకృష్ణ, కొమ్ముల నాగేశ్వరరావు, అనుముల అక్ష్మీశ్వరరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌ కుమార్‌, సిలార్‌ మసూద్‌, తెలకపల్లి శ్రీను, గద్దె ఉమశ్రీ, గుంటుపల్లి రజిని, డి.విమల, షేక్‌ ఫాతిమా, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి సాల్మన్‌, పీ.రాజు, టీ.మల్లయ్య, ఇశ్రాయేల్‌, పిట్టీ ఏసు, దేవయ్య, షేక్‌ చిన్న అల్లాబక్షు, మేడం ఆంజనేయులు, షేక్‌ జిలానీ మాలిక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T14:28:08+05:30 IST