అపూర్వ కలయిక

ABN , First Publish Date - 2022-03-07T06:31:25+05:30 IST

వారంతా ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఉద్యోగ, వ్యాపార రీత్య వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తిరిగి యాభై ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. చదువుకున్న నాటి రోజులను గుర్తుచేసుకు న్నారు. ఆనాటి అనుభూతులు.. అనుభవాలను పంచుకు న్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆదివారం కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో చోటుచేసుకున్న మధుర ఘట్టం ఇది. ఈ వేడుకకు పాఠశాల పూర్వ విద్యార్థి, ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ తోటి స్నేహితులను, ఉపాధ్యాయులను వేమూరి రాధాకృష్ణ ఆప్యాయంగా పలకరించారు.

అపూర్వ కలయిక

అత్యంత వైభవంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఉల్లాసంగా.. ఉత్సాహంగా  సాగిన స్వర్ణోత్సవ వేడుకలు

గురువులు ప్రతీ విద్యార్థిని వెన్ను తట్టి ప్రోత్సహించాలి 

గురు శిష్యుల బంధం జీవితాంతం కొనసాగుతుంది

కోటగిరి పాఠశాల అభివృద్ధికి నావంతు సహకారం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ

ఆంధ్రజ్యోతి, కామారెడ్డి/కోటగిరి మార్చి 6: వారంతా ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఉద్యోగ, వ్యాపార రీత్య వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తిరిగి యాభై ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. చదువుకున్న నాటి రోజులను గుర్తుచేసుకు న్నారు. ఆనాటి అనుభూతులు.. అనుభవాలను పంచుకు న్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆదివారం కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో చోటుచేసుకున్న మధుర ఘట్టం ఇది. ఈ వేడుకకు పాఠశాల పూర్వ విద్యార్థి, ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌  వేమూరి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ తోటి స్నేహితులను, ఉపాధ్యాయులను వేమూరి రాధాకృష్ణ ఆప్యాయంగా పలకరించారు. వారితో తన చిన్ననాటి స్మృతులను ఆనందంగా నెమరువేసుకున్నారు. అదేవిధంగా పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించి విద్యాబోధనలు ఎలా జరుగుతున్నాయనేదా నిపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిని ప్రోత్సహించాలని.. తల్లిదండ్రులు జన్మనిస్తే విద్యార్థులకు భవిష్యత్తునిచ్చే అదృష్టం ఒక్క గురువుకే ఉందన్నారు. మనిషి జీవిత ప్రయాణంలో తనకు ఎదురయ్యే సంఘటనలే మనిషిని రాటుదేలేలా చేస్తాయని.. తన జీవితం సైతం అలాంటిదేనని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని గురు శిష్యుల బంధం విడదీయరానిదని పేర్కొన్నారు. ప్రతీ గురువు విద్యార్థుల ఆర్థిక సామాజిక పరిస్థితులను తెలు సుకుని వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. గతంలో ఉపాధ్యాయులు ఎలాంటి యూనియన్‌లు లేకుండా విద్యార్థులే తమ కుటుంబం అనుకునే వారన్నారు. ఆ సమయంలో వారు నేర్చుకుని మాకు బోధించడం వల్ల ఆ పాఠాలు ఇప్పటికీ తమ మదిలో మెదులుతున్నాయని అన్నారు. తాను పదో తరగతి వరకు కోటగిరిలోనే విద్యనభ్యసించానని తెలిపారు. కోటగిరి జడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవాలకు రావాలంటూ అప్పటి చిన్ననాటి స్నేహితులు వీరేశం, సాయిలు తన దగ్గరకు వచ్చి ఆహ్వానించారన్నారు. యాభై ఏళ్ల తర్వాత చదువుకున్న పాఠశాలకు ముఖ్య అతిథిగా రావడం ఎంతో అనుభూతినిచ్చిందన్నారు. పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక కమిటీ ఏర్పడిందని ప్రతీ ఒక్కరు తమవంతుగా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని రాధాకృష్ణ సూచించారు. అంతకు ముందు కోటగిరి ఇంటిగ్రేటేడ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (కిడ్స్‌) ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాల వేసి వందేమాతరం గీతాలపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. యాభై యేళ్ల క్రితం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. 

 ఫ ఘన స్వాగతం..

స్నేహితులు, సర్పంచ్‌, అధ్యాపకులు, విద్యార్థులు వేమూరి రాధా కృష్ణకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలో తాను చదువుకున్న తరగతి గదులను పాఠశాల ప్రాంగణాన్ని రాధాకృష్ణ పరిశీలించారు. తన్న చిన్ననాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ స్నేహితులతో కలిసి మాట్లాడారు. అనంతరం తనకు విద్యాబుద్ధులు నేర్పిన గోరంటి సత్యనారాయణతో పాటు పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.  

  ఫ పాఠశాల అభివృద్ధికి సహకారం..

కోటగిరి జిల్లా పరిషత్‌ పాఠశాల శిథిలావస్థకు చేరడంతో పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని రాధాకృష్ణ హామీ ఇచ్చారు. తన స్నేహితులు కలిసి పూర ్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేస్తామని చెప్పడంతో తన బాల్య మిత్రులను, గురువులను కలుసుకునే అవకాశం కలిగిందన్నారు. తనతో పాటు స్నేహితులు ఉన్నత స్థానాల్లో ఉన్నందున వారందరి సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డైనింగ్‌ హాల్‌తో పాటు ప్రభుత్వ సహకారంతో మరిన్ని నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు.

  ఫ గురువులకు ఘన సన్మానం..

పాఠశాలలో విద్యాబోధన చేసిన 12మంది గురువులు ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. వారిని పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ.. తా ము విద్యాబోధన చేసిన విద్యార్థులు యాభైఏళ్ల తర్వాత సన్మానించడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతీ పాఠశాలలో కొనసాగించాలని తద్వా రా భావితరాలకు స్ఫూర్తిని అందిస్తుందని పేర్కొన్నారు.

  ఫ విద్యార్థులకు బహుమతులు అందిస్తాం..

కేవీ సుబ్బారావు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఆయన మరణించడంతో వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన తనయుడు రాజగోపాల్‌ కేవీసుబ్బారావు మెరిట్‌ మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఏటా ఈ పాఠశాలలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌ మీడియంలో పదో తరగతిలో మెరిట్‌ సాధించిన ఆరుగురు విద్యార్థులకు పదివేల రూపాయల చొప్పున నగదు బహుమతిని అందిస్తామని పేర్కొన్నారు. 

ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ తాటి వీరేశం, ఉపాధ్యక్షులు పోల విఠల్‌, సాయిలు, జనరల్‌ సెక్రెటరీ ప్రభాకర్‌, జాయింట్‌ సెక్రెటరీ నర్సింహారావు, కోశాధికారి రంగయ్య, పూర్వ విద్యార్థులు గంగాధర్‌గౌడ్‌, నాగేశ్వర్‌రావు, విఠల్‌, రాజేశ్వర్‌ పటేల్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాలప్ప తదితరులు పాల్గొన్నారు.  అలాగే సర్పంచ్‌ పత్తి లక్ష్మణ్‌, పూర్వ విద్యార్థులు రాజేశ్వరరావు పటేల్‌, మనోహర్‌ రావు, రాములు, కాసుల సాయిలు, పోల విఠల్‌రావు, సంగెం నాగులు, గంగాధర్‌ గౌడ్‌, అమ్మని విఠల్‌, కాశీనాథ్‌, విరేశం, కాయపల్లి లక్ష్మణ్‌,  కొల్లూర్‌ కిషోర్‌,  బలరాం, ప్రభాకర్‌, రంగయ్య, కూచీ సాయిలు, పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2022-03-07T06:31:25+05:30 IST