Delhiలో భారీ సాయుధ పహరా మధ్య రిపబ్లిక్ డే వేడుకలు...

ABN , First Publish Date - 2022-01-26T14:45:48+05:30 IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా సాయుధ పోలీసులను మోహరించారు....

Delhiలో భారీ సాయుధ పహరా మధ్య రిపబ్లిక్ డే వేడుకలు...

సరిహద్దుల మూసివేత, పెట్రోలింగ్ ముమ్మరం

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా సాయుధ పోలీసులను మోహరించారు. సాయుధ పోలీసుల పహరా మధ్య రిపబ్లిక్ డే వేడుకలు బుధవారం జరిగాయి.గణతంత్ర దినోత్సవ వేడుకలు గత ఏడాది మాదిరిగా కాకుండా ఎలాంటి సంఘటనలు జరగకుండాఢిల్లీలోని తిక్రీ, సింఘు, ఘాజీపూర్‌తో సహా అన్ని ప్రధాన సరిహద్దు పాయింట్లను మూసివేశారు. సరిహద్దు పాయింట్ల వద్ద అదనపు పికెట్‌లను మోహరించి, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు.ఢిల్లీలో రిపబ్లిక్ డే భద్రతా విధులకు 27,000 మంది పోలీసులను మోహరించి, ఉగ్రవాద వ్యతిరేక చర్యలను ముమ్మరం చేసినట్లు ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.


డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు,సాయుధ పోలీసు బలగాలు కమాండోలు,సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ జవాన్లను మోహరించారు.ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన సీసీటీవీలను అమర్చారు.అన్ని ఎత్తైన భవనాలు రూఫ్‌టాప్ ఏర్పాట్లతో కప్పారు. ఈ నిర్మాణాలలో అనేక యాంటీ-డ్రోన్ పరికరాలను అమర్చినట్లు డీసీపీ తెలిపారు.గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం 71 మంది డీసీపీలు, 213 మంది ఏసీపీలు, 753 మంది ఇన్‌స్పెక్టర్లు సహా మొత్తం 27,723 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందిని నియమించినట్లు పోలీసు కమిషనర్ రాకేష్ అస్థానా తెలిపారు.ఢిల్లీలో ఉగ్రవాద నిరోధక చర్యల్లో నాకా బందీ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.


Updated Date - 2022-01-26T14:45:48+05:30 IST