అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించాలి

ABN , First Publish Date - 2022-01-20T06:13:57+05:30 IST

జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పోలీసు హెడ్‌క్వాటర్స్‌లోని సమావేశ మందిరంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మట్కా నిర్మూలన దిశగా జిల్లా పోలీసు యంత్రాంగం పని చేయాలని, పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు.

అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించాలి
స్టేషన్‌లో సీఐ, డీఎస్పీలతో మాట్లాడుతున్న ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి

పోలీసు అధికారులతో నేర సమీక్షలో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి

ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 19: జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పోలీసు హెడ్‌క్వాటర్స్‌లోని సమావేశ మందిరంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మట్కా నిర్మూలన దిశగా జిల్లా పోలీసు యంత్రాంగం పని చేయాలని, పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే ఒమైక్రాన్‌ దృష్ట్యా ప్రభుత్వం విధించిన ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని, ఇందులో భాగంగా సాంకేతిక నిపుణుల టీంను అభినందించారు. జిల్లా లో మట్కా, గుట్కా, గ్యాంబ్లింగ్‌, గేమింగ్‌, మొదలగు అసాంఘిక కార్యకలాపాల పై పక్కా ప్రణాళికతో స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఉట్నూర్‌ ఏఎస్ప హర్షవర్ధన్‌, డీఎస్పీ ఎన్‌ఎస్‌వీ వెంకటేశ్వర్‌రావు, ఏఆర్‌ డీఎస్పీ విజయ్‌కుమార్‌, సీఐలు శ్రీనివాస్‌, పురుషోత్తం, రామకృష్ణ, జి.మల్లేష్‌, ఫైదారావ్‌, తదితరులు పాల్గొన్నారు.

వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ తనిఖీ

ఆదిలాబాద్‌ వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ను ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌కు వెళ్లిన ఎస్పీకి వన్‌టౌన్‌ సీఐ రామకృష్ణ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు స్టేషన్‌ రిసెప్షన్‌, లాకప్‌, మేన్‌ బ్యారక్‌, పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను, దర్యాప్తు వివరాలను సీఐని అడిగి తెలుసుకున్నారు. కాగా కేసు నమోదు అనంతరం తప్పించుకుని తిరుగుతున్న నిందితులను వెంటనే అరెస్టు చేసి న్యాయ స్థానంలో ప్రవేశ పెట్టాలని సూచించారు. పోలీసు స్టేషన్‌లో రోజువారి నమోదవుతున్న ఫిర్యాదులు, కేసుల రికార్డులను పరిశీలించి సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఎస్పీ మాట్లాడుతూ యూనిఫాం సర్వీస్‌ డెలివరీలో భాగంగా జిల్లాలోని పోలీసు స్టేషన్‌లో అన్ని వర్గాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడం, ఎళ్లవేళల బాధితుల పిర్యాదులపై సత్వరం స్పందించి సేవలు అందించడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా రక్షణ కోసం హెల్మెట్‌ తప్పకుండా ధరించాలని, ఆర్థిక నేరానలు కట్టడి చేసేందుకు పట్టణంలోని అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలకు చైతన్య పర్చాలని సూచించారు. ఇందులో డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, మహిళ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లేష్‌, ఎస్సైలు జి.అప్పారావు, తదితరులున్నారు.

Updated Date - 2022-01-20T06:13:57+05:30 IST