Abn logo
Sep 22 2021 @ 23:34PM

కోరంలేక ఆగిన పీఎంసీ ఎన్నికలు

టెక్కలి రూరల్‌ : గురుకుల పాఠశాలలో పరిస్థితిని పరిశీలిస్తున్న పోలీసులు

 పలు పాఠశాలల్లో వాయిదా ఫ కొన్నిచోట్ల వివాదాలు  

ఆమదాలవలస/రూరల్‌: జిల్లాలోని వివిధ పాఠశాలల్లో బుధవారం జరగాల్సిన తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలను కోరం లేని కారణంగా వాయిదా వేశారు. పాఠశాలలోని ప్రతీ తరగతిలో కూడా 50 శాతం మంది విద్యార్థుల తల్లిదం డ్రులు హాజరైతేనే కోరం పూర్తయినట్టుగా భావించి.. ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారు. అయితే.. చాలా పాఠశాలల్లో తల్లిదండ్రులు తక్కువమంది రావడంతో పీఎంసీ ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఆమదాలవలస పురపాలకసంఘంలోని చిన్నికృష్ణాపురం, వెంగళరావు కాలనీ పాఠశాలల్లో కోరంలేక పీఎంసీ ఎన్నికలను హెచ్‌ఎంలు వాయిదా వేశారు. చిన్నికృష్ణాపురంలో ఓ వర్గం వారు ఎక్కువ ఉండడంతో కోరం లేదని చెప్పి ఎన్నికను వాయిదా వేసినట్లు కొందరు తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీనగర్‌ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కులేక పోయినా పూర్వవిద్యార్థుల పేరుతో  మాజీ కౌన్సిలర్లు దుంపల శ్యామలరావు, జలుమూరు వెంకటేశ్వరరావులు పాల్గొనడంపై విమర్శలు వచ్చాయి. తొగరాం ఉన్నత పాఠశాలలో వైసీపీనాయకుడు తమ్మినేని శ్రీరామమూర్తి హాజరయ్యా రు. ఆమదావలస మండలం  కణుగులవలస, తోటాడ చిట్టివలస, బొబ్బిలిపేట, సంతకొత్తవలస, పీర్‌సాహెబ్‌పేట, దూసిపేట పాఠశాలల ఎన్నికలు కూడా కోరం లేక నిలిచాయి. ఫ బూర్జ మండలంలో పీఎల్‌దేవిపేట, వావం, పాలవ లస, జగ్గన్నపేట, గుత్తావిల్లి, కొల్లివలస ఏపీ ఆదర్శపాఠశాలల  ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఫ పొందూరు మండలంలో  తోలాపి, పెనుబర్తి, వావిల పల్లిపేట ఆదర్శ పాఠశాలలతోపాటు మరో 45 పాఠశాలల్లో ఎన్నికలను వాయిదా వేశారు. ఫ సరుబుజ్జిలి మండలంలోని వీరభద్రపురం పాఠశాలకు రెగ్యులర్‌ ఉపాధ్యాయుడులేక, పెద్దసవలాపురం, బురిడివలసకాలనీ, బుడ్డివ లసల్లో కోరం లేక ఎన్నికలు వాయిదాపడ్డాయి. గార:  వివిధ కారణాల వల్ల అంపోలు జడ్పీ హైస్కూల్‌, కె.సైరిగాం ప్రాథమిక పాఠశాలల్లో  తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు నిర్వహించలేదని ఎంఈవో ఆర్‌.శ్రీనివాస్‌ తెలిపారు. ఇక్కడ గురువారం ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. వజ్రపుకొత్తూరు: మండ లంలోని కొండవూరులో సమయభావం వల్ల పీఎంసీ ఎన్నిక వాయిదా పడిం దని ఎంఈవో నరసింహులు తెలిపారు. ఎచ్చెర్ల: మండలంలోని చిలకపాలెం, బొంతలకోడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలు, పూడివలస, చిలకపాలెం, కొత్త మత్స్యలేశం ప్రాథమిక పాఠశాలలు, పొన్నాడ కేజీబీవీలో కోరం లేక తల్లిదం డ్రుల కమిటీ ఎన్నికను వాయిదా వేసినట్టు ఎంఈవో కారు పున్నయ్య తెలి పారు. ఎల్‌ఎన్‌పేట: బోరమాంబపురం, బొడ్డవలస, తాయిమాంబపురం పాఠశాలల్లో పీఎంసీ ఎన్నికలు కోరం లేకపోవడంతో వాయిదాపడగా, బసవ రాజుపేట పాఠశాలలో చైర్మన్‌, వైస్‌చైర్మన్ల కోసం పోటీపడి ఎన్నిక నిలిచిపోయి నట్టు ఎంఈవో ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు. వంగర: మరువాడ, కొప్పర వలస, మద్దివలసలో విద్యార్థుల తల్లిదండ్రులు 50 శాతం కంటే తక్కువ హాజరుకావడంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు హెచ్‌ఎంలు యరకయ్య, తారుపతిరావు,మోహనరావులు తెలిపారు.  సంతబొమ్మాళి:  బోరుభద్రలోని జడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయని ఎంఈవో  జలుమూరు చిన్నవాడు చెప్పారు. పాతపట్నం: పెద్దసీది జడ్పీహెచ్‌,  సిం గుపురం ఎంపీపీ పాఠశాలల్లో  కోరంలేక ఎన్నిక వాయిదాపడినట్లు ఎంఈవో  తెలిపారు. సారవకోట (జలుమూరు): సారవకోట మండలంలోని అలుదు ఉన్నత పాఠశాల, పెద్దలంబ ప్రాథమికోన్నత పాఠశాల పీఎంసీ ఎన్నికలు  కోరం లేక వాయిదా పడ్డాయి. కోటబొమ్మాళి: కొత్తపల్లి, కన్నేవలస  పాఠశా లల్లో ఎన్నికలు నిర్వహించలేదని ఎంఈవో చిన్నవాడు తెలిపారు.