సిబ్బంది లేని పశువైద్య కేంద్రాలు

ABN , First Publish Date - 2021-10-06T05:21:18+05:30 IST

మండలంలోని పశువైద్య కేంద్రాల్లో సిబ్బంది తగి నంత మంది లేరు.

సిబ్బంది లేని పశువైద్య కేంద్రాలు
ఆలమూరులోని పశువైద్య ఉపకేంద్రం

  1. ఇబ్బంది పడుతున్న పాడి రైతులు
  2. మూతపడుతున్న పశువుల ఆస్పత్రులు


పాణ్యం, అక్టోబరు 5: మండలంలోని పశువైద్య కేంద్రాల్లో సిబ్బంది తగి నంత మంది లేరు. దీంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో గోరుకల్లు, బలపనూరు గ్రామాలలో పశు వైద్య కేంద్రాలు ఉన్నాయి. పాణ్యంలో ఏడీహెచ్‌  స్థాయి వైద్యశాల ఉంది. పాణ్యం పరిధిలో సుగాలిమెట్ట ఉండగా గోరుకల్లు పరిధిలో కొనిదేడు, ఆలమూరు, తమ్మరాజుపల్లెలో ఉపకేంద్రాలు పనిచేస్తున్నాయి. బలపనూరు పరిధిలో కౌలూరు, మద్దూరు, తొగర్చేడు  ఉపకేంద్రాలు పనిచేస్తున్నాయి. ఒక్కో ఉప కేంద్రం పరిధిలో రెండేసి గ్రామాలు ఉన్నాయి. ఏడీతోపాటు ఇద్దరు పశువైద్యులు ఉన్నా కిందిస్థాయి సిబ్బంది లేకపోవడంతో కొన్నిచోట్ల ఉపకేంద్రాలు మూతపడుతున్నాయి. ఆలమూరులోని ఉపకేంద్రం సిబ్బంది లేక మూతపడింది. అత్యవసరమైతే పక్క ఉప కేంద్రాల నుంచి సిబ్బంది అక్కడి కేంద్రాన్ని మూసేసి వైద్యం చే యడానికి వెళ్లాల్సి వస్తోంది.  సచివాలయాలలోని పశువైద్య సహాయకులు రైతులకు సలహాలు ఇవ్వడమే తప్ప వైద్యం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అత్యవస సేవలకు వెళ్లాలంటే దాదాపు 30 కిలోమీటర్లు వెళ్లాలి.  కందికాయపల్లె, పిన్నాపురం, గగ్గటూరు, అనుపూరు, అహల్యాపుం తొగర్చేడు గ్రామాలకు వెళ్లడానికి  వాహనాలు, రోడ్ల సదుపాయం కూడా లేదు.  


 వైద్యం అందక బర్రెను కోల్పోయాను 

 సరైన వైద్యం అందక రూ. లక్షల బర్రెను కోల్పోయాను. సిబ్బంది లేక పోవడంతో పశువైద్య కేంద్రాన్ని మూసేశారు. సచివాలయంలోని పశువైద్య సహాయకులు అందుబాటులో ఉండడం లేదు. పశువైద్యకేంద్రానికి స్థానికులు భవనాన్ని విరాళంగా ఇచ్చారు. అయినా వైద్యం అందు బాటులోకి రాలేదు. 

- వెంకట్రామిరెడ్డి, ఆలమూరు 


 ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి 

 ప్రభుత్వం పాడి పశువుల వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. పశువైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష ధోరణి వహిస్తోంది. ఆలమూరులో పశువైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలి.  

- చంద్రశేఖరరెడ్డి, సహకార సొసైటీ మాజీ డైరెక్టర్‌, ఆలమూరు 


సిబ్బంది కొరత ఉన్నా సత్వర వైద్యం అందిస్తున్నాం

 గ్రామాలలో పశువులకు అత్యవసర వైద్యం అవసరమైతే వెంటనే వెళ్తున్నాం.  సమీప ఉపకేంద్రాలలోని సిబ్బందికి  సూచనలిచ్చి పంపిస్తు న్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేంద్రాలలో సిబ్బంది కొరత ఉంది. ప్రభుత్వం సిబ్బందిని నియమిస్తే సత్వర వైద్యమందించే అవకాశమేర్పడుతుంది. 

- డాక్టర్‌ సులోచన, గోరుకల్లు 



Updated Date - 2021-10-06T05:21:18+05:30 IST