ఎడతెరపిలేని వర్షం

ABN , First Publish Date - 2020-08-14T10:18:46+05:30 IST

జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఎడతెరపిలేని వర్షం

12.1 మి.మీ. వర్షపాతం నమోదు

పొంగిన వాగులు, వంకలు

పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌

ఇబ్బందులు పడ్డ ప్రజలు

ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పెరుగుతున్న ఇన్‌ఫ్లో

ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత, గోదావరి 


మంచిర్యాల, ఆగస్టు 13: జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం అర్ధరాత్రి ప్రారంభమైన వర్షం గురువారం సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా 12.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. గ్రామాల్లో రోడ్లు బురదమయంగా మారి ప్రజలు కనీసం నడవలేని స్థితి కి చేరుకున్నాయి. అక్కడక్కడ వాగులు, ఒర్రెలు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని ప్రాణహిత నది పొంగి పొర్ల గా, గోదావరిలోకి పెద్ద మొత్తంలో నీరు చేరుతోంది. మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికా రులు సూచించారు. కోటపల్లి మండలం నక్కలపల్లి దారిలో లోతోర్రె, ఏదుల బందం వద్ద తుంతుంగా ప్రాజె క్టు వరద నీరు మత్తడి గుండా బయటకు రావడంతో రాకపోకలు స్తంభించాయి.


ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 25,916 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ ఫ్లో 16,378 క్యూసెక్కులు ఉంది. ప్రస్తు తం ప్రాజెక్టులో 11.817 టీఎంసీల నీరు నిలువ ఉంది.  ఎడతెరపి లేని వర్షం కారణంగా సింగరేణి ఓసీపీలలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. శ్రీరాంపూర్‌ ఓపెన్‌ కాస్టులో సుమారు 12 వేల టన్నులు, మందమర్రి కేకే ఓసీలో గురువారం సుమారు 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 


మండలాల వారీగా నమోదైన వర్షపాతం...

జిల్లాలోని పలు మండలాల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. జన్నారంలో 30.6 మి.మీ, దం డేపల్లిలో 26.1, లక్షెట్టిపేటలో 5.8, హాజీపూర్‌లో 8.9, కాసిపేటలో 3.9, తాండూర్‌లో 4.7, భీమినిలో 3.8, కన్నెపల్లిలో 11, వేమనపల్లిలో 26.5, నెన్నెలలో 9.4, బెల్లంపల్లిలో 13.8, మందమర్రిలో 18.2, మంచిర్యాలలో 16.6, న స్పూర్‌లో 16, జైపూర్‌లో 12.5, భీమారంలో 3.5, చెన్నూర్‌లో 3.0, కోటపల్లిలో 3.9మి.మీ వర్షపాతం నమోదైంది. 


చెన్నూర్‌ లో కుండపోత

చెన్నూర్‌:  కుండపోతగా కురుస్తున్న వర్షానికి మండలంలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.  నారాయణపూర్‌, చెన్నూర్‌, చింతలపల్లి వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. సుద్దాల వాగు ఉప్పొంగి ప్రవహించడంతో తాత్కాలిక రహదారి కొట్టుకుపో యింది. దీంతో దాదాపు పది గ్రామాల ప్రజలు బాహ్యప్రపంచానికి దూరమయ్యారు. అక్కెపల్లి లో లెవల్‌ కాజువే ఉప్పొంగి ప్రవహించింది. వర్షంతో రహదారులు అన్ని బురదమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుద్దాల వాగుతోపాటు నారాయణపూర్‌, కత్తెరశాల, అక్కె పల్లి లోలెవల్‌ కాజువే, సంకారం, బుద్దారం వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. పట్టణంలోని వివిధ కాలనీల్లో నాళాల నీరు రహదారులపై ప్రవహించడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. 


జనజీవనం అస్తవ్యస్తం

కోటపల్లి: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురు స్తున్న వర్షాలతో కోటపల్లి మండలంలో జనజీవనం అస్త వ్యస్తమైంది. వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లు తుండగా గ్రామాల్లోని రహదారులు బురదమయమ య్యాయి. ఏదులబంధం వద్ద తుంతుంగ ప్రాజెక్టు వరద నీరు మత్తడి గుండా బయటకు వచ్చి సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్న వంతెనను నీట ముంచింది. దీంతో వంతెన వద్ద రాకపోకలు నిలిచిపోయి ఏడు గ్రామాల ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. నక్కలపల్లి రహదారిలోని లోతొర్రె, గొర్రెగట్టు వాగులు పొంగడంతో రవాణా నిలిచిపోయింది. ప్రాణహిత నది వరద ఉధృతి కొనసాగుతోంది.  


భీమారం: మండలంలో గురువారం ఉదయం ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో పలు గ్రామా ల్లోని మట్టిరోడ్లు బురదమయంగా మారి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. 


మందమర్రిటౌన్‌: మందమర్రిలో ఎడ తెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. మార్కెట్‌ ప్రాంతమంతా నీరు నిలిచింది. వర్షంతో పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. ఎంవీటీసీ కోల్‌బెల్ట్‌ రోడ్డు వద్ద, హన్మాన్‌ ఆలయం వద్ద రోడ్డుపై నీరు నిలిచింది. 


మందమర్రిరూరల్‌: మండలంలో గురువారం ఉద యం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రైతులు పనులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోయారు.  పలు గ్రామాల్లో మట్టి రోడ్లు బురదమ యంగా మారాయి. 


కాసిపేట: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పత్తి పంట నీట మునిగింది. దీం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోనాపూర్‌, ము త్యంపల్లి, కాసి పేట, కోమటిచేను, నగరం, పల్లంగూడ, ధర్మారావుపేట గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో పత్తి నీట మునిగింది. దాదాపు 200 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో  జనజీవనం స్తంభించిపోయింది.  

Updated Date - 2020-08-14T10:18:46+05:30 IST