మంత్రిగారూ.. మా మొర వినరూ!

ABN , First Publish Date - 2021-10-22T05:12:02+05:30 IST

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది నెలల పాటు దిశ వన్‌స్టాప్‌ సిబ్బందికి జీతాలు అందడం లేదు. అసలే అరకొర జీతం.. అది కూడా ప్రతినెలా సకాలంలో చెల్లించకపోవ డంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మంత్రిగారూ.. మా మొర వినరూ!
జిల్లా కేంద్రంలో దిశ వన్‌ స్టాప్‌ సెంటర్‌ భవనం

  9 నెలలుగా  దిశ వన్‌స్టాప్‌ సిబ్బందికి అందని జీతాలు  

  నేడు జిల్లాకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి రాక

  స్పందించాలని వినతి

విజయనగరం (ఆంధ్రజ్యోతి): ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది నెలల పాటు దిశ వన్‌స్టాప్‌ సిబ్బందికి జీతాలు అందడం లేదు. అసలే అరకొర జీతం.. అది కూడా ప్రతినెలా సకాలంలో చెల్లించకపోవ డంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా.. ఫలితం శూన్యం. నేడు జిల్లాలో  మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పర్యటించ నున్న నేపథ్యంలో ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. వాస్తవంగా కేంద్ర నిధులతో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలో దిశ వన్‌స్టాప్‌ సెంటర్‌ (సఖీ) నడుస్తోంది. ఇందులో సెంట్రల్‌ అడ్మిన్‌స్ట్రేటివ్‌-1, హెల్పర్లు-3 , డేటా ఎంట్రీ ఆపరేటర్లు -2, మెడికల్‌ విభాగ సిబ్బంది-3, కేసు వర్కర్లు-3 , కౌన్సెలర్లు-3,  సెక్యూ రిటీ గార్డు ఒకరు చొప్పున మొత్తంగా 16 మంది ఉన్నారు. సెంటర్‌లో మొత్తం 18 మంది పని చేస్తున్నారు. వారిలో ఒకరు రెగ్యులర్‌ కాగా    సెక్యూరిటీ గార్డు మినహా మిగిలిన 16 మంది కాంట్రాక్ట్‌,  ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి రూ.20 వేల జీతంతో వారు విధులు నిర్వహి స్తున్నారు. అయితే కొన్నేళ్లుగా అరకొర జీతంతో పనిచేస్తున్న వారికి ఇతర జిల్లాలో ఏదో ఓ శాఖ నుంచి వీరికి జీతాలు చెల్లిస్తున్నారు. ఇక్కడ మాత్రం ఈ పరిస్థితి లేదు. మంత్రి తానేటి వనిత తమగోడు ఆలకించి జీతాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు  విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయంపై ఐసీడీఎస్‌ పీడీ  రాజేశ్వరిని వివరణ  కోరగా 9 నెలల నుంచి జీతాలు ఆగిన మాట వాస్తవమేనని తెలిపారు.  మూడు నెలల జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జేసీ మహేష్‌ కుమార్‌కు గురువారం నివే దిక పంపించామన్నారు. త్వరలోనే సిబ్బంది ఖాతాల్లోకి నగ దు జమకానుందని చెప్పారు.   ఇదిలా ఉండగా అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్‌ బిల్లులు భారంగా మారాయని అంగన్‌వాడీ వర్కర్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అనసూయ తెలిపారు. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ సెం టర్లకు అద్దెలు చెల్లించలేకపోతున్నామని,  కేటగిరీ -2గా నిర్ధారించడంతో ఎక్కువ మొత్తంలో విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయని చెప్పారు. తమకు వచ్చే జీతాల్లోంచే వాటిని చెల్లింస్తుండడంతో ఆర్థిఽక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అంగన్‌వాడీలకు బకాయి పడిన ఒక నెల జీతం చెల్లించాలని కోరారు. 

 

Updated Date - 2021-10-22T05:12:02+05:30 IST