కానరాని నిధులు.. కదలని పనులు!

ABN , First Publish Date - 2021-08-27T05:16:18+05:30 IST

శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన బోధనాసుపత్రి (జీజీ హెచ్‌)లో నూతన భవన నిర్మాణాలపై సందేహాలు నెల కొన్నాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆరు భవనాల పనులను కాంట్రాక్టర్లు అర్ధాంతరంగా నిలిపేశారు. మరోపక్క ప్రభుత్వం ‘నాడు-నేడు’ పథకం కింద కొత్తగా నిధులు మంజూరు చేసింది. తమకు పెండింగ్‌ బిల్లులు చెల్లించకుండా.. కొత్త నిధులు ఎలా మంజూరు చేస్తారని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. పనుల నిర్వహణపై శుక్రవారం ప్రభుత్వ సర్వజన భోధనాసుపత్రిలో ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఎమ్‌డీ మురళీధర్‌ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.

కానరాని నిధులు.. కదలని పనులు!
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

 జీజీహెచ్‌లో అర్ధాంతరంగా నిలిచిన ఆరు భవనాల నిర్మాణాలు 

 కాంట్రాక్లర్లకు రూ.12.54 కోట్ల బకాయిలు

 పాత బిల్లులు చెల్లించకుండా.. ‘నాడు-నేడు’ కింద రూ.150 కోట్లు మంజూరు 

 కొత్త పనుల నిర్వహణపై సందేహాలు

గుజరాతీపేట, ఆగస్టు 26: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన బోధనాసుపత్రి (జీజీ హెచ్‌)లో నూతన భవన నిర్మాణాలపై సందేహాలు నెల కొన్నాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆరు భవనాల పనులను కాంట్రాక్టర్లు అర్ధాంతరంగా నిలిపేశారు. మరోపక్క ప్రభుత్వం ‘నాడు-నేడు’ పథకం కింద కొత్తగా నిధులు మంజూరు చేసింది. తమకు పెండింగ్‌ బిల్లులు చెల్లించకుండా.. కొత్త నిధులు ఎలా మంజూరు చేస్తారని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. పనుల నిర్వహణపై శుక్రవారం ప్రభుత్వ సర్వజన భోధనాసుపత్రిలో ఏపీ ఎంఎస్‌ఐడీసీ ఎమ్‌డీ మురళీధర్‌ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జీజీహెచ్‌లో రెండేళ్ల కిందట లెక్చర్‌ హాళ్లు, లైబ్రరీ, హాస్టళ్లు, వంటి ఆరు భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రూ.60 కోట్లు మంజూరు చేశాయి. జీజీహెచ్‌లో పెరుగు తున్న అవసరాల దృష్ట్యా.. సత్వరమే పనులు పూర్తి చేయా లని కాంట్రాక్టర్లు, ఏపీఎంఎస్‌ఐ డీసీ ఇంజనీరింగ్‌ అంధికారులను అప్పటి కలెక్టర్‌ నివాస్‌ ఆదేశించా రు. ఈ పనులను ఆయన అనేక సార్లు పరిశీలించారు. దీంతో సుమారు 30 శాతం పనులు శరవేగంగా పూర్తిచేశారు. వీటికి సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.12.54కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో వారు పది నెలల నుంచి పనులను నిలిపేశారు. ఇదిలా ఉండగా, జీజీహెచ్‌లో మరికొన్ని నూత న భవన నిర్మాణాలు, పాత భవనాల ఆధునికీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘నాడు-నేడు’ పథకం కింద సుమారు రూ.150 కోట్ల నిధులను మంజూరు చేసింది. గత పను లకు సంబంధించి కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు విడు దల చేయలేదు. తమకు బకాయిలు చెల్లించకుండా.. కొత్త  నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయడం ఏంటని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. మరోపక్క రూ.150 కోట్లతో చేపట్టే నూతన పనులను ఏపీఎంఎస్‌ఐడీసీతోపాటు ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌శాఖల పర్యవేక్షణలో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతు న్నారు. వీటిని కూడా వారు కాంట్రాక్టర్లకు అప్పగించి పూర్తి చేయాల్సి ఉంటుంది. పాత బిల్లులు పెం డింగ్‌లో ఉండగా.. కొత్త పనులు చేపట్టేందుకు కాం ట్రాక్టర్లు ముందుకు వస్తారో.. లేదోనన్నది చర్చ నీయాంశమవుతోంది. ఈ పనులు ఎప్పటికి పూర్త వుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.  


పాత బిల్లులు చెల్లిస్తాం

జీజీహెచ్‌లో నూతన భవన నిర్మాణాలు, పాత భవనాల ఆధునికీకరణకు ప్రభుత్వం ‘నాడు-నేడు’ పథకం కింద రూ.150కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే ఆరు భవన నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.12.54 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో ఆ పనులు నిలిచిపోయాయి. వారికి పాత బిల్లులు చెల్లించిన వెంటనే కొత్త పనులు ప్రారంభిస్తాం.

- ప్రసాదరావు, ఈఈ, ఏపీఎంఎస్‌ఐడీసీ, శ్రీకాకుళం


నేడు ఏపీఎంఎస్‌ఐడీసీ ఎమ్‌డీ రాక 

ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డీ మురళీధర్‌రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నట్లు శ్రీకాకుళం ఏపీఎంఎస్‌ఐడీ ఈఈ ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, పలాసలోని కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన బోధనాసుపత్రిలో ‘నాడు-నేడు’ కింద చేపట్టనున్న పనులపై సంబంధిత అధికారులతో ఎమ్‌డీ మురళీధర్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు.

Updated Date - 2021-08-27T05:16:18+05:30 IST