పత్తాలేని నజరానా!

ABN , First Publish Date - 2022-09-09T05:51:01+05:30 IST

పంచాయతీ పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రోత్సాహా నిధులతో గ్రామాలను మ రింత అభివృద్ధి చేసుకోవచ్చని ఆశ పడ్డ పంచాయతీలకు నిరాశనే కనిపిస్తుంది. మూడున్నరేళ్లు గడిచి పోతు న్న ప్రభుత్వం నజరానా ఊసెత్తడమే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నజరానాను రూ.10 లక్షలకు పెంచుతు ప్ర భుత్వం ని ర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలకు ముందు ఎంతో హాడావిడి చేసిన ఆ తర్వాత అసలు విషయాన్నే మరిచారు. ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రో త్సాహ నిధులను అందిస్తుందని ఏకగ్రీవ పంచాయతీలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.

పత్తాలేని నజరానా!
జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం

    జిల్లాలో 162 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

    మూడున్నరేళ్లు గడిచినా.. స్పష్టతనివ్వని ప్రభుత్వం

    నిధుల లేమితో పల్లెప్రగతి పనులకు ఆటంకాలు

    ప్రోత్సాహ నిధుల కోసం ఎదురుచూపులు

    ఆదిలాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీ పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రోత్సాహా నిధులతో గ్రామాలను మ రింత అభివృద్ధి చేసుకోవచ్చని ఆశ పడ్డ పంచాయతీలకు నిరాశనే కనిపిస్తుంది. మూడున్నరేళ్లు గడిచి పోతు న్న ప్రభుత్వం నజరానా ఊసెత్తడమే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నజరానాను రూ.10 లక్షలకు పెంచుతు ప్ర భుత్వం ని ర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలకు ముందు ఎంతో హాడావిడి చేసిన ఆ తర్వాత అసలు విషయాన్నే మరిచారు. ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రో త్సాహ నిధులను అందిస్తుందని ఏకగ్రీవ పంచాయతీలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. 

    జిల్లాలో 468 గ్రామ పంచాయతీలు

    జిల్లాలో 468 గ్రామ పంచాయతీలు ఉండగా 162 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. భారీ నజరానా అందుతుందని గ్రామ పె ద్దలు ఏకమై పాలక వర్గాన్ని ఏకగ్రీవం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొందరు అభ్యర్థులు ఎన్నికల పోటీలో నిలిచిన ఈ నజరానా కా రణంగానే పోటీ నుంచి తప్పుకొని ఏకగ్రీవానికి తమవంతు సహకారా న్ని అందించారు. ప్రభుత్వం అందిం చే నిధులతో తమ గ్రామాన్ని మరిం తగా అభివృద్ధి చే సుకోవచ్చని భా వించారు. జిల్లాలో ని 162 ఏకగ్రీవ పంచాయతీలకు గాను ఒక్కొ పం చాయతీకి రూ. 10 లక్షల చొప్పున రూ. 16 కోట్ల 20 లక్షలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. గత పాలక వర్గాలకు చివరి సమయంలో ప్రోత్సాహాక నిధు లను విడుదల చేయడంతో సక్రమం గా సద్వినియోగం కాలేదన్న అభిప్రా యాలు వ్యక్తమయ్యాయి. ఈసారైనా ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను సకాలంలో విడుదల చేస్తే శా శ్వత సమస్యలను పరిష్కారానికి అవకా శం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    నిధుల ఊసేలేదు..

    గ్రామ పంచాయతీ ఎన్నికలు జరి గి మూడున్నరేళ్లు గడిచి పోతున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పంచాయతీల కు అందించే ప్రోత్సాహాక నిధు ల ఊసెత్తడం లేదు. దీంతో ఆ యా గ్రామాల సర్పంచ్‌లకు ఎ దురుచూపులు తప్పడం లేదు. గ్రామ పంచాయ తీ ఎన్నికలు జరిగి ఇప్పటికి మూడున్నరేళ్లు గ డుస్తున్న ప్రభుత్వం నుంచి ప్రోత్సాహ నిధులు అందక పోవడంతో అభివృద్ధి జరుగడం లేదు. గతంలోనే ప్రోత్సాహాక నిధులు వస్తాయన్న ఆశతో కొందరు సర్పంచ్‌లు శాశ్వత సమస్య ల పరిష్కారానికి పనులు చేపట్టారు. దీం తో నిధుల విడుదల కాక పోవడంతో పెట్టిన పెట్టుబడులు చేతికి రాక అప్పుల పాలవుతున్నారు. ఏకగ్రీ వంగా ఎన్నిక కావడంతో ఎంతో ఉత్సాహాంగా    ఉన్నసర్పంచ్‌లు అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే పనులను పూర్తి చేసిన సర్పంచ్‌లు మాత్రం నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామ ప్రజలు త మపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నార ని వారికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే నిధుల విడుదల తప్పనిసరి అంటున్నారు. ప్ర త్యేక నిధులు లేక పోవడంతో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని పనులను చేపట్టే అవకాశమే లేకుండా పోయిందని పలువురు సర్పంచ్‌లు వాపోతున్నారు. ప్రజల కు ఏ సమాధానం చెప్పలేక పో తున్నామని అంటున్నారు. ప్ర భుత్వం తగు నిర్ణయం తీ సుకోవాలని కోరుతున్నారు. 

    ముందుకు సాగని పల్లె ప్రగతి..

    గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నెల నె ల అందిస్తున్న నిధులు ఏ మూలాన సరిపోవడం లేదంటున్నారు. దీంతో పల్లె ప్రగతి పనులు ముందుకు సాగడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అరకొరగా అందుతున్న నిధుల నుంచి పంచాయతీ ట్రాక్టర్‌ వాయిదాలు, మల్టిపర్‌పస్‌ సిబ్బంది వేతనాలు, విద్యుత్‌ బిల్లులు, ఇతరాత్ర ఖర్చులకే చెల్లించాల్సి వస్తుందని సర్పంచ్‌లు వాపోతున్నారు. గ్రామాలను మరింత బలోపేతం చేసేందుకు రా ష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తుంది. ఇప్పటికే పల్లె ప్రణాళిక ముగిసిన ప్రోత్సాహా నిధుల జాడే కనిపించడం లేదు. పల్లె ప్రగతికి ప్రణాళికలు రూపొందించిన సరిపడ నిధులు లేక పోవడంతో గ్రామాభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. గ్రామాల్లో పల్లె ప్రగతి కింది నర్సరీలు, శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డులు, పల్లె ప్రకృతి వనాలు తదితర పనులు కొనసాగుతున్న అసంపూర్తిగానే కనిపిస్తున్నాయి. సాధారణంగా పంచాయతీలకు కేటాయించే అరకొర నిధు లతో శాశ్వత సమస్యల పరిష్కారానికి అస్కారం ఉండదంటున్నారు. కేవలం పారిశుధ్యం, వీధి దీపాల ఏర్పాటు, ట్రాక్టర్‌ నిర్వాహణ, పంచాయతీ సిబ్బంది వేతనాలు, మంచి నీటి సరఫరా లాంటి పనులకే సరి పోతున్నాయని చెబుతున్నారు.

    Updated Date - 2022-09-09T05:51:01+05:30 IST