కొడుకును కలవాలనుకున్న తండ్రి.. వీల్లేదన్న తల్లి.. కోర్టు మెట్లెక్కితే వచ్చిన తీర్పు ఏంటంటే..

ABN , First Publish Date - 2022-01-14T18:50:46+05:30 IST

అతడికి వరుసగా సెలవులు రావడంతో కొడుకుతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలనుకున్నాడు..

కొడుకును కలవాలనుకున్న తండ్రి.. వీల్లేదన్న తల్లి.. కోర్టు మెట్లెక్కితే వచ్చిన తీర్పు ఏంటంటే..

అతడికి వరుసగా సెలవులు రావడంతో కొడుకుతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలనుకున్నాడు.. అందుకు సిద్ధమయ్యాడు.. అయితే అందుకు అతడి భార్య నిరాకరించింది.. కొడుకును కలిసేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది.. ఎందుకంటే సదరు వ్యక్తి కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదు.. దీంతో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.. ఆ కేసును విచారించిన కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది.. వ్యాక్సిన్ వేసుకోకుండా చిన్న పిల్లలను కలవకూడదని స్పష్టం చేసింది.. 


కెనడాకు చెందిన ఓ వ్యక్తి సెలవుల్లో తన కొడుకుతో కలిసి గడపాలని అనుకున్నాడు. అయితే అందుకు అతడి మాజీ భార్య నిరాకరించింది. కరోనా వ్యాక్సిన్ వేసుకోకుండా కొడుకును కలవొద్దని చెప్పింది. దీంతో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన న్యాయమూర్తి ఆ మహిళకు అనుకూలంగా తీర్పునిచ్చారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వ్యాక్సిన్ వేసుకోని వ్యక్తికి తన కొడుకుతో గడిపే హక్కు లేదని, మిగతా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ తీర్పు వెలువరిస్తున్నట్టు పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-14T18:50:46+05:30 IST