యూపీ, బీహార్‌ టు నిజామాబాద్‌

ABN , First Publish Date - 2021-06-11T05:08:17+05:30 IST

జిల్లాలో వరినాట్లు వేసేందుకు ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన కూలీలు వలస వస్తున్నారు. ప్రతీ సంవత్సరం రెండు నెలల పాటు ఇక్కడే ఉండి వరి నాట్లు వేస్తారు.

యూపీ, బీహార్‌ టు నిజామాబాద్‌
నాట్లు వేసేందుకు యూపీ, బీహార్‌ నుంచి వచ్చిన కూలీలు

వరి నాట్ల కోసం వలసవచ్చిన కూలీలు
ప్రతీ సంవత్సరం రెండు నెలల పాటు వరినాట్లతో ఉపాధి
ఎకరాకు రూ.4వేల నుంచి రూ.4,500లు చెల్లిస్తున్న రైతులు

నిజామాబాద్‌, జూన్‌ 10 (ఆంద్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వరినాట్లు వేసేందుకు ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన కూలీలు వలస వస్తున్నారు. ప్రతీ సంవత్సరం రెండు నెలల పాటు ఇక్కడే ఉండి వరి నాట్లు వేస్తారు. మగ కూలీలే వరినాట్లు త్వరగా వేస్తుండడంతో రైతులు కూడా వీరి సేవలను వినియోగించుకుంటున్నారు. సీజన్‌లో డిమాండ్‌ను బట్టి ఎకరాకు రూ.4వేల నుంచి రూ.4,500 వరకు తీసుకుంటున్నారు. జిల్లాలో వానాకాలం, యాసంగి సీజన్‌లలో అత్యధికం గా వరి పంటను సాగుచేస్తారు. జిల్లాలో కూలీలు సరిపోకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చి వరి నాట్లు వేయిస్తున్నారు. జిల్లాలో ప్రతీ సంవత్సరం జూన్‌ నెలలోనే వర్ని, రుద్రూరు, కోటగిరి మండలాలో వరి నాట్లు వేస్తా రు. ఈ సంవత్సరం కూడా వానాకాలం ఇంకా మొదలు కాకముందే శ్రీనగర్‌, వర్ని గ్రామాల పరిధిలో వరినాట్లు మొదలయ్యాయి. ఈ గ్రామాల పరిధిలో బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు వరినాట్లు వేస్తున్నారు. సంప్రాదాయా నికి భిన్నంగా మొత్తం మగ కూలీలే వరినాట్లు వేస్తారు. ఐదు గురు ఒక జట్టుగా ఉండి రోజుకు 10 నుంచి 12 ఎకరాల వర కు వరి నాట్లు వేస్తున్నారు. గంటకు ఎకరం చొప్పున వీరు వరి నాట్లు వేస్తుండడంతో రైతులు కూడా వీరికి అవకాశం ఇస్తు న్నారు. వీరు ఉదయం 6గంటలకే పొలానికొచ్చి సాయంత్రం 6గంటల వరకు నాట్లు వేస్తారు. గ్రామాల్లో కూలీలు అందు బాటులో లేక, మహిళలు ఉదయం 10 నుంచి 5గంటల మధ్య పనిచేస్తుండడంతో మగ కూలీల వైపే మొగ్గుచూపుతున్నారు.
20 నుంచి 25 మంది ఒక జట్టుగా
ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌ నుంచి వీరు జట్లుగా వస్తున్నారు. 20 నుంచి 25 మంది వచ్చి ఒకే దగ్గర ఉంటారు. వంట కలిసే చేసుకుంటారు. తమకు తెలిసిన రైతుల గ్రామాలకు మొదట వెళ్తారు. ఆ గ్రామంలో వరినాట్లు పూర్తికాగానే పక్క గ్రామాలకు వెళ్తారు. పూర్తిస్థాయిలో పనులు అయిన తర్వాతనే తిరిగి తమ రాష్ట్రాలకు వెళ్తారు. వీరికి రెండు నెలల పాటు ప్రతీరోజు పని ఉంటుంది. నాట్లు ఆలస్యమైతే మరో నెల ఉండి వెళ్తారు. తమ రాష్ట్రాలలో తగినంతగా పనిలేకపోవడం వల్లనే ఇక్కడికి వస్తున్నామని తెలిపారు. కుటుంబాలను సొంత గ్రామాలలో ఉంచి వస్తున్నామని వారు తెలిపారు. తమకు అన్ని ఖర్చులు పోను నెలకు రూ.20వేల నుంచి రూ.30వేల మధ్య మిగులుతాయని తెలిపారు. వానాకాలంతో పాటు యాసంగి సీజన్‌లో కూడా వచ్చి వెళ్తామని తెలిపారు.
మా రాష్ట్రంలో పనిలేకనే ఇక్కడికి వచ్చాం..
- తరుణ్‌, బవ్లీపూర్‌, ఉత్తరప్రదేశ్‌

మా గ్రామంతో పాటు రాష్ట్రంలో పని దొరకడంలేదు. ఇక్కడికి వస్తే 2 నెలల పాటు పని దొరుకుతుంది. రైతులు కూడా సహకరిస్తున్నా రు. గడిచిన నాలుగేళ్లుగా ఇక్కడికి వచ్చి వరి నాట్లు వేసి వేస్తున్నాం.
25 మంది జట్టుగా వచ్చాం..
- ఇంద్రజిత్‌, ఉత్తరప్రదేశ్‌

వర్ని మండలానికి 25 మందిమి జట్టుగా వచ్చాం. నిత్యం 10 నుం చి 12 ఎకరాలలో వరినాట్లు వేస్తున్నాం. సీజన్‌ ముగిసే వరకు ఉంటు న్నాం. చుట్టపక్కల గ్రామాలకు కూడా వెళ్లి నాట్లు వేస్తున్నాం.

Updated Date - 2021-06-11T05:08:17+05:30 IST