Abn logo
Sep 27 2021 @ 14:03PM

యోగి మంత్రివర్గ విస్తరణ కంటితుడుపు చర్య: బీఎస్‌పీ

న్యూఢిల్లీ: యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ జరపడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) ఆక్షేపించింది. ఇదే కేవలం కండితుడుపు చర్య మాత్రమేనని అభివర్ణించింది. బీఎస్‌పీ జాతీయ ప్రతినిధి సుదీంద్ర భడోరియా సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రివర్గ విస్తరణ కేవలం కంటితుడుపు చర్య తప్ప మరొకటి కాదని చెప్పారు. ప్రజలు ఈ ట్రాప్‌లో పడరని, నిత్యావసరాల ధరలు తగ్గించడంలో కానీ, యువతకు ఉపాధి కల్పన, రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విషయం ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. ఇవే అంశాలపై ప్రజలు విశ్లేషణ చేసుకుని బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపనున్నారని చెప్పారు.


చెరకుకు క్వింటాలుకు 25 రూపాయలు ఎస్‌ఏపీ పెంచుతున్నట్టు యోగి సర్కార్ ప్రకటించడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధామిస్తూ, బీఎస్‌పీ హయాంలో చెరకు ఎస్ఏపీని మాయావతి రెట్టింపు చేశారని గుర్తు చేశారు. ఐదేళ్లు గడిచినా యోగి ప్రభుత్వం కనీసం 10 శాతం కూడా పెంచలేకపోయిందని చెప్పారు. చెరకు పండించే రైతులకు ఉపశమన చర్యగా రూ.10,000 కోట్ల బకాయిలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని భడోరియా డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption