వ్యాక్సిన్‌పై వదంతులు వ్యాప్తి... కేసు నమోదు!

ABN , First Publish Date - 2021-01-19T17:56:09+05:30 IST

యూపీలోని బరేలీలోగల ఒక కాలనీలో కొందరు అల్లరిమూకలు కరోనా వ్యాక్సిన్‌పై వదంతులు...

వ్యాక్సిన్‌పై వదంతులు వ్యాప్తి... కేసు నమోదు!

బరేలీ: యూపీలోని బరేలీలోగల ఒక కాలనీలో కొందరు అల్లరిమూకలు కరోనా వ్యాక్సిన్‌పై వదంతులు వ్యాపింపజేస్తూ, ఇందుకు సంబంధించిన పోస్టర్లు అతికిస్తున్న ఉదంతం వెలుగు చూసింది. ఈ నేపధ్యంలో పోలీసులు ఇటువంటి అజ్ఞాత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా సర్విలెన్స్ అధికారి డాక్టర్ రంజన్ గౌతమ్ మాట్లాడుతూ రాజేంద్ర నగర్ పరిధిలో కరోనా టీకా విషయమై దుష్ప్రచారం సాగిస్తున్నారని గుర్తించామన్నారు. 


దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయన్నారు. ఈ విధమైన ప్రచారాలు సాగిస్తూ, టీకాపై ప్రజల్లో లేనిపోని అపోహలు కలిగిస్తున్నారన్నారు. ఈ నేపధ్యంలో ఈ కరపత్రాల ఆధారంగా కొందరు అజ్ఞాత వ్యక్తులపై ప్రేమ్ నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. ఇదే సమయంలో పట్టణంలో పోలీసు భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. అల్లరిమూకల ఆగడాలకు అడ్డుకట్టవేస్తామని తెలిపారు. 


Updated Date - 2021-01-19T17:56:09+05:30 IST