రామజన్మభూమి స్థలానికి చేరుకున్న యూపీ సీఎం, గవర్నర్

ABN , First Publish Date - 2020-08-05T16:52:16+05:30 IST

అయోధ్య నగరంలో బుధవారం రామాలయం భూమి పూజ కార్యక్రమం కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నరు ఆనందిబెన్ పటేల్, బీజేపీ ఉపాధ్యక్షురాలు ఉమాభారతిలు అయోధ్యకు వచ్చారు....

రామజన్మభూమి స్థలానికి చేరుకున్న యూపీ సీఎం, గవర్నర్

అయోధ్య : అయోధ్య నగరంలో బుధవారం రామాలయం భూమి పూజ కార్యక్రమం కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నరు ఆనందిబెన్ పటేల్, బీజేపీ ఉపాధ్యక్షురాలు ఉమాభారతిలు అయోధ్యకు వచ్చారు. రాంలాలాను దర్శనం చేసుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. రామజన్మభూమి స్థలాన్ని సందర్శిస్తున్న మొట్టమొదటి ప్రధానిగా మోదీ నిలిచారు. ప్రధాని హనుమాన్ గర్హి మందిరాన్ని సందర్శించిన తర్వాత భూమిపూజ స్థలానికి వస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా సరయూ నదీ తీర ప్రాంతంతోపాటు అయోధ్య నగరాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు. హనుమాన్ మందిరాన్ని శానిటైజ్ చేశారు. అయోధ్య రామజన్మభూమి కేసులో కక్షిదారు అయిన ఇక్బాల్ అన్సారీ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యలోని సరయూ నదీ తీరం సాధువుల భజనలతో మార్మోగింది. ప్రజలు, సాధువులు జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు. 

Updated Date - 2020-08-05T16:52:16+05:30 IST