Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 11 2021 @ 07:34AM

Mathura: కృష్ణ జన్మభూమి చుట్టూ మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం

యూపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు

మధుర (ఉత్తరప్రదేశ్): మధురలోని బృందావన్‌లో శ్రీకృష్ణుడి జన్మస్థలం చుట్టూ 10 చదరపు కిలోమీటర్ల పరిధిలో మద్యం, మాంసం విక్రయించడాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది.ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ అధికారులతో మధురలో సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురలోని 22 మున్సిపల్ వార్డులున్న ఈ ప్రాంతాన్ని యాత్రా స్థలంగా యూపీ సర్కారు ప్రకటించింది.బృందావన్‌లో గణేష్ చతుర్థి వేడుకలకు ముందు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మధురలో మద్యం,మాంసాన్ని విక్రయించడాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాత తాజాగా ఈ ప్రకటన వచ్చింది.మధుర ప్రాంతంలో మాంసం, మద్యం లేకుండా ఉంచాలని ప్రజలు కోరినట్లు యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.గతంలో మద్యం, మాంసం వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తుల ఉపాధి కోసం ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సీఎం చెప్పారు.గతంలో మద్యం,  మాంసం వ్యాపారంలో పాలుపంచుకునే వారు పాలు విక్రయించాలని సిఎం యోగి ఆదిత్యనాథ్ సూచించారు.


Advertisement
Advertisement