కూతురిపై అఘాయిత్యం చేసిన తండ్రికి Death Sentence

ABN , First Publish Date - 2021-11-24T14:09:06+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది....

కూతురిపై అఘాయిత్యం చేసిన తండ్రికి Death Sentence

యూపీ కోర్టు సంచలన తీర్పు

లక్నో (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్‌ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన మైనర్ కూతురిపై అత్యాచారం చేసిన 40 ఏళ్ల కీచక తండ్రికి మరణశిక్ష విధిస్తూ బహ్రైచ్‌ కోర్టు తీర్పు చెప్పింది. సంఘటన జరిగిన తర్వాత మూడు నెలల లోపు తండ్రిని దోషిగా నిర్ధారించిన కోర్టు అదనపు సెషన్స్ జడ్జి నితిన్ కుమార్ పాండే శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని ప్రత్యేక  జిల్లా ప్రభుత్వ న్యాయవాది సంత్ ప్రతాప్ సింగ్ చెప్పారు. మైనర్ కుమార్తెను పెళ్లి చేశాక కూడా, ఆమెను ఇంటికి తీసుకువచ్చి అత్యాచారం చేశాడని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. 


14 ఏళ్ల బాధిత బాలికపై సాక్షాత్తూ తండ్రి అత్యాచారం చేస్తుండగా బాలిక భర్త పట్టుకొని కేసు పెట్టాడు. గత రెండేళ్లుగా తండ్రి అత్యాచారం చేస్తున్నా బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపింది.బాధితురాలితోపాటు ఆమె కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.దోషికి మరణశిక్షతోపాటు 51వేలరూపాయల జరిమానా కూడా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.


Updated Date - 2021-11-24T14:09:06+05:30 IST