100కు ఫోన్ చేసి ప్రధాని మోదీకి బెదిరింపు

ABN , First Publish Date - 2020-08-11T11:23:00+05:30 IST

సాక్షాత్తూ 100 పోలీసు ఎమర్జెన్సీ ఫోన్ నంబరుకు ఫోన్ చేసి మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకే హాని తలపెడతానని బెదిరించిన యువకుడి....

100కు ఫోన్ చేసి ప్రధాని మోదీకి బెదిరింపు

నోయిడా (ఉత్తర్‌ప్రదేశ్): సాక్షాత్తూ 100 పోలీసు ఎమర్జెన్సీ ఫోన్ నంబరుకు ఫోన్ చేసి మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకే హాని తలపెడతానని బెదిరించిన యువకుడి ఉదంతం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా నగరంలో వెలుగుచూసింది. హర్యానా రాష్ట్రానికి చెందిన హర్‌భజన్ సింగ్ నోయిడా నగరంలో నివాసముంటున్నారు. ఈయన మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. హర్‌భజన్ సింగ్ సోమవారం 100 పోలీసు ఎమర్జెన్సీ ఫోన్ నంబరుకు ఫోన్ చేసి ప్రధాని మోదీకే హాని తలపెడతానంటూ బెదిరించాడు. నోయిడా ఫేజ్ 3 పోలీసులు నిందితుడైన హర్‌భజన్ సింగ్ ను పట్టుకొని ప్రశ్నిస్తున్నారు. ప్రధానిని బెదిరించిన హర్‌భజన్ సింగ్ డ్రగ్ ఎడిక్టు అని, అతన్ని ప్రశ్నించి వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపించామని నోయిడా అదనపు డీసీపీ అంకూర్ అగర్వాల్ చెప్పారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీని ఫోన్ లో బెదిరించిన యువకుడి ఘటన నోయిడాలో సంచలనం రేపింది.  

Updated Date - 2020-08-11T11:23:00+05:30 IST