పంచాయితీ ఎన్నికల్లో పోటీచేయాలకున్న పూజారి అదృశ్యం... స్థానికుల ఆందోళన...

ABN , First Publish Date - 2021-04-08T20:58:38+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లో అదృశ్యమైన 60 ఏళ్లఇప్పటికే ఆలయ పూజారి బాబా హరి గిరి మహరాజ్ ఎక్కడున్నారో గుర్తించాలని...

పంచాయితీ ఎన్నికల్లో పోటీచేయాలకున్న పూజారి అదృశ్యం...  స్థానికుల ఆందోళన...

ముజఫర్‌నగర్: ఉత్తర ప్రదేశ్‌లో అదృశ్యమైన 60 ఏళ్ల ఆలయ పూజారి బాబా హరి గిరి మహరాజ్ ఎక్కడున్నారో గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ వందలాది మంది గ్రామస్తులు, సాధువులు ఫుగానా పోలీస్ స్టేషన్‌ ముందు ధర్నా చేపట్టారు. మీరట్- కర్నాల్ హైవేని సైతం పాక్షికంగా దిగ్బంధించి నిరసన తెలిపారు. సర్నావలీ గ్రామానికి చెందిన శివాలయ పూజారి బాబా హరి గిరి మహారాజ్ త్వరలో జరిగే యూపీ పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ నెల 3 నుంచి ఆయన ఉన్నట్టుండి అదృశ్యం కావడంతో స్థానిక పూజారులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమీప గ్రామాలకు చెందిన సాధువులు సైతం తరలివచ్చి ఆందోళన చేపట్టారు. తొలుత అదృశ్యం కేసు నమోదు చేసినప్పటికీ.. తర్వాత దీన్ని కిడ్నాప్ కేసుకు మార్చారు. పూజారిని గుర్తించేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాన్ని నియమించామని డీఎస్పీ శరద్ చంద్ర శర్మ పేర్కొన్నారు. పూజారి జాడ త్వరలోనే గుర్తిస్తామనీ.. గ్రామస్తులు, సాధువులు తమ ఆందోళన విరమించాలంటూ డీఎస్పీ కోరారు. 

Updated Date - 2021-04-08T20:58:38+05:30 IST