గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేపై మనీలాండరింగ్ కేసు

ABN , First Publish Date - 2020-07-10T04:42:29+05:30 IST

లక్నో: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేయనుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) ప్రకారం సంబంధిత పత్రాలు సమర్పించాలని ఉత్తరప్రదేశ్ పోలీసులను కోరింది.

గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేపై మనీలాండరింగ్ కేసు

లక్నో: గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేయనుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) ప్రకారం సంబంధిత పత్రాలు సమర్పించాలని ఉత్తరప్రదేశ్ పోలీసులను కోరింది.

మరోవైపు గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను మధ్యప్రదేశ్ పోలీసులు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ పోలీసులకు అప్పగించారు. దుబేకు ట్రాన్సిట్ రిమాండ్‌ విధించగానే ప్రత్యేక వాహనంలో అతడిని కాన్పూర్‌కు తరలిస్తున్నారు. అంతకు ముందు మధ్యప్రదేశ్ ఉజ్జెయిన్‌ మహాకాళేశ్వర్ మందిర్‌లో దాక్కున్న దుబేను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అటు దుబే భార్య రిచా దుబేను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. లక్నో కృష్ణానగర్ నుంచి దుబే భార్యను, కుమారుడిని, ఇద్దరు నౌకర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దుబే భార్య సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త. 

ఈ నెల రెండున ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌ బిక్రూ గ్రామంలో వికాస్ దుబే గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో డీసీపీ, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోయారు. 

Updated Date - 2020-07-10T04:42:29+05:30 IST