అక్కడ భిక్షాటన చేస్తే.. ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.20లక్షల ఫైన్!

ABN , First Publish Date - 2021-04-17T22:51:09+05:30 IST

ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో భిక్షాటనపై నిషేధం ఉంది. ఆయా ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ ఎవరైనా పట్టుబడితే అక్కడి చట్టాల ప్రకారం వాళ్లు కఠిన శిక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ భిక్షాటను నేరంగా భావిం

అక్కడ భిక్షాటన చేస్తే.. ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.20లక్షల ఫైన్!

అబుధాబి: ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో భిక్షాటనపై నిషేధం ఉంది. ఆయా ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ ఎవరైనా పట్టుబడితే అక్కడి చట్టాల ప్రకారం వాళ్లు కఠిన శిక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ భిక్షాటను నేరంగా భావించే దేశాల జాబితాలో యూఏఈ కూడా ఉంది. యూఏఈలో ఈ నేరానికి ఎవరైనా పాల్పడితే భారీ జరిమానాతోపాటు జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయ సలహాదారులు చెబుతున్నారు. 2018 ఫెడరల్ లా నెంబర్.9లోని ఆర్టికల్ 5 ప్రకారం ఎవరైనా భిక్షాటన చేస్తూ పట్టుబడితే.. సదరు వ్యక్తి 5000దిర్హమ్‌లకు తగ్గకుండా జరిమానా కట్టడంతోపాటు సుమారు మూడు నెలలపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని లీగల్ అడ్వైజర్ అడెల్ షాకీ ఓ ప్రకటనలో వెల్లడించారు.



అంతేకాకుండా.. ‘వ్యవస్థీకృత భిక్షాటనను నిర్వహిస్తున్న వారికి ఆరునెలలు మించకుండా జైలు శిక్ష, 100,000 దిర్హమ్‌ల జరిమానా విధించబడుతుంది’ అని పేర్కొన్నారు. కొవిడ్ నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం భిక్షాటన నేరానికి పాల్పడిన వారిపట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తోందని మరో లాయర్ సౌద్ అల్ అబ్దులీ అన్నారు. కొవిడ్-19తో బాధపడుతూ భిక్షాటన చేయడం ద్వారా.. ఇతరులు మహమ్మారి బారినపడటానికి కారణమైన వ్యక్తి దాదాపు 100,000 దిర్హమ్‌ల(ఇండియన్ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.20లక్షలు)ను జరిమానాగా కట్టడంతోపాటు 5సంవత్సరాల జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 


Updated Date - 2021-04-17T22:51:09+05:30 IST