‘ఉపా’ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-01-21T06:30:31+05:30 IST

ఉపా (యూఏపీఏ) చట్టాన్ని తక్షణం రద్దు చెయ్యాలని కోరుతూ పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా, ర్యాలీ నిర్వహించారు.

‘ఉపా’ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలి

రామచంద్రపురం, జనవరి 20: ఉపా (యూఏపీఏ) చట్టాన్ని తక్షణం రద్దు చెయ్యాలని కోరుతూ పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా, ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో ఎం.గాంధీకి వినతిపత్రం అంద జేశారు. ఈసందర్భంగా వామపక్షాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కాపా డుతున్న ఆదివాసీలను దేశద్రోహులుగా, అభివృద్ధి నిరోధకులుగా పరిగణిస్తోందని, ప్రజాస్వామిక హక్కుల కోసం పనిచేస్తున్న నాయకులను, రచయితలను, మేధావులను కోరేగావ్‌ కుట్ర కేసులో మావో యిస్టులతో సంబంధాలు వున్నాయనే ఆరోపణలతో ఉపా చట్టం కింద అరెస్టు చేశారన్నారు. వారిపై కేసులను ఎత్తివేయ డమే కాకుండా ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే ఉద్య మాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షుడు ఓగూరి బాలాజీరావు, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు జి.సూరిబాబు, సీపీఐ జిల్లా నాయకుడు పి.రాము, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బి.సిద్ధు, చైతన్య మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమ, సామాజిక విప్లవ చైతన్య వేదిక కన్వీనర్‌ దేపాటి శివప్రసాద్‌, సీపీఐ (ఎంఎల్‌) నాయకులు భీమశంకర్‌, ఆదినారాయణ, సీపీఐ నాయకులు ఎంవీ రమణ, పీవైఎల్‌ జిల్లా కార్యదర్శి ఎం.రాజు, మచ్చ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T06:30:31+05:30 IST