‘ఉపాధి’ అక్రమార్కులపై వేటు

ABN , First Publish Date - 2021-06-19T05:33:40+05:30 IST

ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడిన నలుగురు అధికారులపై వేటుపడింది. తర్లుపాడులో ఉపాధి హామీ పనుల్లో దొంగ మస్టర్లు వేసి ఎఫ్‌ఏ, టీఏ, సిబ్బంది భారీఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఈ అవకతవకలపై గత గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై జిల్లా అధికారులు స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. మార్కాపురం క్లస్టర్‌ ఏపీడీ మధుసూధన్‌రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు.

‘ఉపాధి’ అక్రమార్కులపై వేటు
తర్లుపాడులో ఉపాధిపనుల మస్టర్లలో వేసిన వేలిముద్రలు (ఫైల్‌)

నలుగురుని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు

తర్లుపాడు, జూన్‌ 18: ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడిన నలుగురు అధికారులపై వేటుపడింది. తర్లుపాడులో ఉపాధి హామీ పనుల్లో దొంగ మస్టర్లు వేసి ఎఫ్‌ఏ, టీఏ, సిబ్బంది భారీఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఈ అవకతవకలపై గత గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై జిల్లా అధికారులు స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. మార్కాపురం క్లస్టర్‌ ఏపీడీ మధుసూధన్‌రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. మస్టర్ల షీట్లలో ఒకే వ్యక్తికి చెందిన వేలిముద్రలు అనేకసార్లు ఉండటంలాంటి వ్యవహారాల నేపథ్యంలో పనుల్లో జరిగిన అవినీతిపై నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో అవినీతిలో భాగస్వాములైన ఏపీవో వై.మహాలక్ష్మి, ఈసీ పి.పెద్దన్న, టీఏ ఎ.రమేష్‌, ఫీల్ట్‌ అసిస్టెంట్‌ కె.వెంకటేశ్వర్లను విధుల నుంచి తొలగిస్తూ శుక్రవారం పీడీ సీనారెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు ఎంపీడీవో ఎస్‌.నరసింహులు తెలిపారు. తర్లుపాడు పనుల్లో అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ చేసి అవినీతికి పాల్పడిన వారి వద్ద నుంచి మొత్తం సొమ్మును రికవరీ చేస్తామని ఏపీడీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఎక్కువుగా అవినీతికి పాల్పడిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వెంకటేశ్వర్లుపై క్రిమినల్‌ కేసు కూడా నమోదు చేసే అవకాశముందని ఆయన తెలిపారు.  


Updated Date - 2021-06-19T05:33:40+05:30 IST