ఉపాధి పనుల బిల్లులు తక్షణం చెల్లించాలి

ABN , First Publish Date - 2021-08-03T07:09:37+05:30 IST

ఉపాధి హామీ పనుల బకాయిలు చెల్లించాల్సిందిగా హైకోర్టు ఆదేశించినప్పటికీ వైసీపీ ప్రభుత్వం మిన్నకుండటంపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉపాధి పనుల బిల్లులు తక్షణం చెల్లించాలి

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 2 : ఉపాధి హామీ పనుల బకాయిలు చెల్లించాల్సిందిగా హైకోర్టు ఆదేశించినప్పటికీ వైసీపీ ప్రభుత్వం మిన్నకుండటంపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పనుల బకాయిలు చెల్లించాలంటూ ఎంపీడీవో జి.వి.సూర్యనారాయణకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా ఉపాధి పనుల బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ, అధికారులు రాజకీయ ఒత్తిడికి తలొగ్గకుండా న్యాయస్థానం తీర్పు మేరకు పెండింగ్‌ బిల్లులు వెం టనే చెల్లించాలన్నారు.  టీడీపీ నాయకులు మోటమర్రి బాబా ప్రసాద్‌, గోపు సత్యనారాయణ, కుంచే నాని, పి.వి.ఫణికుమార్‌, మరకాని పరబ్రహ్మం, లంకిశెట్టి నీరజ, కరెడ్ల సుశీల, కార్పొరేటర్లు సమతా కీర్తి, దింటకుర్తి సుధాకర్‌, అనిశెట్టి రామకోటేశ్వరరావు, వడ్లమూడి త్రివిక్రమరావు, చిట్టూరి యువరాజ్‌, గోకుల్‌ శివ, పుప్పాల ప్రసాద్‌, నీలం రామకృష్ణ, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.   

గూడూరులో నిరసన

 ఉపాధి హామీ పనుల బిల్లులు తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గూడూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడి కళతప్పాయని కొనకళ్ల అన్నారు. ఉపాధి బిల్లు లు  వెంటనే చెల్లించాలని కోరుతూ ఎంపీడీవో వెంకటేశ్వరరావుకు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, టీడీపీ నేత కాగిత కృష్ణప్రసాద్‌ తదితరులు వినతిపత్రం సమర్పించారు.   టీడీపీ నాయకులు పోతన స్వామి, అన్నం హరిరామకృష్ణ, పి.వి. ఫణికుమార్‌, కూనపరెడ్డి వీరబాబు, ఇల్లూరి లీలాకృష్ణ, అర్జా గణేష్‌, బుర్రా కాశీ, పిన్నింటి రత్తయ్య, గోపీ నాగబాబు, గొరిపర్తి ఫణి, బేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

 అవనిగడ్డలో..

అవనిగడ్డ టౌన్‌  : ఉపాధి హామీ పథకం పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ నాయకులు అవనిగడ్డ ఎంపీడీవో కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలియజేశారు. వైసీపీ అధికారొ చేపట్టిన దగ్గర నుంచి గతంలో చేసిన ఉపాధి పనుల బిల్లులు చెల్లించకుండా నిలిపి వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి నిధులు విడుద లైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని దారి మళ్లించి బిల్లులు చెల్లించకపోవటంతో పనులు చేసిన మాజీ సర్పంచ్‌లు, కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, బండే రాఘవ, గాజుల మురళీకృష్ణ, పులిగడ్డ నాంచారయ్య, తుంగల శ్రీనివాసరావు, రేపల్లె అంకినీడు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-08-03T07:09:37+05:30 IST