‘ఉపాధి’లో అవకతవకలు

ABN , First Publish Date - 2021-06-15T06:33:03+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధి హా మీ పథకంలో అవకతవకలు చోటుచేసు కుంటున్నాయి.

‘ఉపాధి’లో అవకతవకలు
ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌)


సమాచార హక్కు చట్టంతో 

వెలుగులోకి వచ్చిన అవినీతి

తర్లుపాడు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాజీనామా

తర్లుపాడు, జూన్‌ 14: జాతీయ గ్రామీణ ఉపాధి హా మీ పథకంలో అవకతవకలు చోటుచేసు కుంటున్నాయి. తర్లుపాడు మండలంలో జరుగుతున్న పనుల్లో దొంగ మస్టర్లు వేసుకొని  ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెం ట్లు, అధికారులు కుమ్మక్కై కూలీల నోట్లో మట్టి కొట్టి కొడుతున్నారు. ప్రధానంగా  తర్లు పాడులో భారీ స్థాయి లో అవినీతి చోటుచేసుకుంది. ఈ గామంలో లేనివారి పేర్లతో, వ్యాపారం చేసుకుంటున్న వారి పేర్లతో, హైదరా బాద్‌, బెంగళూరు సాఫ్టవేర్‌ ఉద్యోగం చేస్తున్న వారి పేర్లతో దొంగ మస్టర్లు వేసుకొని అవినీతికి పాల్ప డు తు న్నారని ఆరోపణలు వస్తున్నాయి. తర్లుపాడు జిల్లా పరి షత్‌ ఉన్నత పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ షేక్‌ అలిసా సమాచార హక్కు చట్టం ద్వారా ఫిబ్రవరి నుంచి మే వరకు తీసిన మస్టర్‌ షీట్లను చూస్తే అవకతవకలు జరిగినట్లు తేలింది. గత నాలుగు నెలల నుంచి 1800 దొంగ మస్టర్లు వే సుకొని సుమారు రూ.5 లక్షల వరకు అవినీతికి పాల్పడినట్లు గ్రామంలో చర్చించుకుంటు న్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో తర్లుపాడు  ఫీల్డ్‌ అసిస్టెంట్‌  ఉద్యోగానికి రాజీనామా చేశారు. 

అవినీతి జరుగుతుంది ఇలా... 

తర్లుపాడులో ఉపాధి హామీ పనికి రానివారి వద్దకు వెళ్లి ముందుగా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఒక ఒప్పందం చేసుకుం టారు. పనులకు రాకపోయినా సరే నేను మస్టర్లు వేసు కుంటాను. వారానికి రూ.1400 కూలీ వస్తే రూ.400 మీరు తీసుకొని రూ.వెయ్యి తిరిగి ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత దొంగ మస్టర్లు వేసుకొని కూలి డబ్బులు జేబులో వేసు కుంటాడు.  ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సహచరులు కొందరు బెంగ ళూరు, హైదరాబాద్‌లో ప్రైవే ట్‌ ఉద్యోగాలు చేస్తుండగా, వారి పేర్లతో కూడా మస్టర్లు వేసుకొని డబ్బులు స్వాహా చే స్తున్నట్లు తెలిసింది. మస్టర్‌ సీట్లలో పది మందికి చెందిన వేలి ముద్ర లను ఒకేసారి ఒక వ్యక్తి వేసినట్లు తెలు స్తోంది. 

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

ఉపాధి హామీ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు కన్నెత్తి చూడక పోవ డం తో ఫీల్డ్‌ అసిస్టెంట్లది ఇష్టారాజ్యంగా మారింది. కూలీల కొలతలను టెక్నికల్‌ అసి స్టెంట్‌ తీయాల్సి ఉండగా, ఫీల్డ్‌ అసిస్టెంట్లే కొలతలు తీస్తున్నారు. తమకు అనుకూలమైన వారికి ఎక్కువ కూలీ వేస్తు నిజమైన లబ్ధిదారులకు మొండిచేయి చూపిస్తు న్నారు. 

పనుల నిలిపివేత

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాజీనామా చేయడంతో తర్లుపాడులో ఉపాధి పనులు లేక కూలీలు ఇళ్ల వద్దనే ఉంటున్నారు. రోజు 800 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వె ళ్తుంటారు. తక్షణమే అధికారులు స్పందించి తర్లుపాడు లో ఉపాధి హామీ పనులను మొదలు పెట్టాలని కూలీలు కోరుతున్నారు.


ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పై విచారణ చేయాలి

తర్లుపాడు గ్రామంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ దొంగ మస్టర్లు వేసుకొని నాలుగు నెలల వ్యవధిలో రూ.5 లక్షల వరకు అవినీతికి పాల్పడినట్లు మస్టర్‌ షీట్లలో వెలుగులోకి వచ్చింది. ఈ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చేసిన అవినీతిపై సమగ్ర విచారణ చేసి సొమ్మును రికవరీ చేయాలి.

- షేక్‌ అలిసా,  

ఉన్నత పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాజీనామా చేశారు

తర్లుపాడు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వెంకటరెడ్డి గత గురు వారం రాజీనామా చేశారు. కొత్తగా ఇద్దరు ఫీల్డ్‌ అసి స్టెంట్‌లను నియమించేందుకు ఉన్నతాధికారులకు నివే దిక పంపిస్తున్నాం.. తర్లుపాడులో బుధవారం నుంచి ఉపాధి హామీ పనులు మొదలు పెట్టి కూలీలకు పనులు కల్పిస్తాం.

- ఎస్‌.నరసింహులు, ఎంపీడీవో 




Updated Date - 2021-06-15T06:33:03+05:30 IST