Abn logo
May 21 2020 @ 11:38AM

ఉపాసన కండోమ్ స్కర్ట్.. ధైర్యం ఉందా అంటూ పోస్ట్!

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ భార్యగానే కాకుండా పలు రంగాలలో ప్రతిభ చూపుతూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఉపాసన. పలు సామాజిక కార్యక్రమాలలో కూడా ఉపాసన చురుకుగా పాల్గొంటుంటారు. తనకు వచ్చిన పలు ఐడియాలను సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకోవడం ఉపాసనకు అలవాటు. 


తాజాగా ఉపాసన మరో సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పనికి రాని వాటితో, పాడైపోయిన కండోమ్స్‌తో డిజైనర్ దుస్తులు తయారు చేయడం గురించి ఉపాసన తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. లోకల్ డిజైనర్‌లు తిరస్కరించిన టెక్స్‌టైల్ స్క్రాప్‌తో తయారు చేసిన టాప్, పాడైపోయిన కండోమ్స్‌తో తయారు చేసిన స్కర్ట్ ధరించిన తన ఫోటోను ఉపాసన పోస్ట్ చేశారు. ఇలాంటి దుస్తులను ధరించడానికి ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు.  ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement
Advertisement
Advertisement