వాహనాల మార్కెట్ మళ్లీ బిజీ.. వచ్చే వారంలో ఏడు కార్లు లాంచింగ్

ABN , First Publish Date - 2020-07-12T02:47:53+05:30 IST

దేశంలోకి కరోనా మహమ్మారి కాలుమోపిన తర్వాత కళా విహీనమైన వాహన మార్కెట్ మళ్లీ కొత్త కళను

వాహనాల మార్కెట్ మళ్లీ బిజీ.. వచ్చే వారంలో ఏడు కార్లు లాంచింగ్

న్యూఢిల్లీ: దేశంలోకి కరోనా మహమ్మారి కాలుమోపిన తర్వాత కళా విహీనమైన వాహన మార్కెట్ మళ్లీ కొత్త కళను సంతరించుకోబోతోంది. వచ్చే వారం ఏకంగా ఏడు కొత్త కార్లు విఫణిలోకి రాబోతున్నాయి. వీటిలో చాలా వరకు వర్చువల్ ఈవెంట్ల ద్వారా లాంచ్ కానున్నాయి.


హ్యుందయ్ టుక్సన్ 2020: ఆటో ఎక్స్‌పో 2020లో తళుక్కుమన్న ఈ కారు ఈ నెల 14 వర్చువల్ ఈవెంట్ ద్వారా మార్కెట్లో అడుగుపెట్టబోతోంది. నిజానికీ ఎస్‌యూవీ ఈ ఏడాది రెండో త్రైమాసికంలోనే విడుదల కావాల్సి ఉన్నా కరోనా వైరస్ కారణంగా లాంచింగ్ ఆలస్యమైంది. 


హోండా సిటీ: హోండా కార్స్ ఇండియా తన ఫ్లాగ్‌షిప్ సెడాన్ సిటీ 2020ని ఈ నెల 15న లాంచ్ చేస్తోంది. ఐదో తరం సెడాన్ అయిన ఇది ఈ ఏడాది మొదట్లోనే విడుదల కావాల్సి ఉన్న కొవిడ్ సవాళ్ల కారణంగా వాయిదా పడింది. మారుతి సుజుకి సియాజ్, హ్యుంద్ వెర్నా వంటి వాటికి ఇది గట్టిపోటీ ఇస్తుందని తెలుస్తోంది. 


ఎంజీ హెక్టార్ ప్లస్: ఈ నెల 13 దీనిని విడుదల చేయబోతున్నారు. 6 సీటర్ అయిన ఈ ఎస్‌యూవీకి రూ. 50 వేలతో అడ్వాన్స్ బుకింగులు కూడా ప్రారంభమయ్యాయి. టాటా గ్రావిటాస్, హ్యుందయ్ క్రెటా 7 సీటర్ (ప్రస్తుతం కొరియాలో అభివృద్ధి దశలో ఉంది), టొయోటా ఇన్నోవా క్రిస్టా వంటి వాటికి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. 


ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్ బ్యాక్:  జులై 16న దీనిని విడుదల చేయబోతున్నట్టు ఆడి ఇప్పటికే ప్రకటించింది. 5 సీటర్ కార్ అయిన ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్‌కు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇది సెకండ్ జనరేషన్ కారు. ఇది మరింత మెరుగైన పనితీరు, సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఆగస్టు నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. దీని ప్రారంభ ధర రూ.  10 లక్షలు 


బీఎండబ్ల్యూ ఐఎక్స్3: ఈ నెల 14 ఐఎక్స్ 3 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ వెహికల్‌ లాంచింగ్‌కు బీఎండబ్ల్యూ సిద్ధమైంది. ఇది ఐదో తరం బీఎండబ్ల్యూ ఈడ్రైవ్‌ టెక్నాలజీతో వస్తోంది. వీటిలో ఎలక్ట్రిక్ ఇంజన్, పవర్ ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్‌మిషన్‌తో కూడిన డ్రైవ్ యూనిట్ సెంట్రల్ హౌసింగ్‌తో ఉంది. 


నిస్సాన్ అరియా ఎస్‌యూవీ:  కరోనా కారణంగా చాలా ఆలస్యమైన అరియా ఎస్‌యూవీ ఎట్టకేలకు లాంచింగ్‌కు సిద్ధమైంది. ఈ నెల 15న దీనిని విడుదల చేయబోతున్నట్టు జపనీస్ కార్ మేకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అరియా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మాత్రం 2021లో రానుంది. 


ఫోర్డ్ బ్రోంకో ఎస్‌యూవీ: ఈ నెల 13న సోమవారం ఇది విడుదల కాబోతోంది. నిజానికి ఈ కారు ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కావాల్సి ఉండగా, వివిధ కారణాల కారణంగా వాయిదా పడింది. తాజాగా, ఫోర్డ్ బ్రోంకో 4X4ను సోమవార విడుదల చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.

Updated Date - 2020-07-12T02:47:53+05:30 IST