Abn logo
Nov 25 2021 @ 02:32AM

వచ్చే ఐపీఎల్‌ ఏప్రిల్‌ 2 నుంచి?

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఐపీఎల్‌ ఏప్రిల్‌ మొదటివారంలో ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఇంకా మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఖరారు కానప్పటికీ, చెన్నై వేదికగా ఏప్రిల్‌ 2వ తేదీన వచ్చే సీజన్‌ను ఆరంభించాలని బోర్డు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈసారి అదనంగా అహ్మదాబాద్‌, లఖ్‌నవూ ఫ్రాంచైజీలు చేరడంతో మొత్తం పది జట్ల మధ్య 60 రోజులపాటు లీగ్‌ జరిపించే యోచనలో బీసీసీఐ ఉందని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.