Abn logo
Jan 13 2021 @ 11:37AM

`ఉప్పెన` వచ్చేస్తోందా?

మెగా మేనల్లుడు, సాయి తేజ్‌ తమ్ముడు `పంజా` వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా `ఉప్పెన`. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. తమిళ ప్రముఖ కథానాయకుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు.


రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. అయితే.. కరోనా కారణంగా కుదరలేదు. ఓటీటీల నుంచి భారీ ఆఫర్స్ వచ్చినప్పటికీ `నో` చెప్పారు. థియేటర్లోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 5న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారట. సంక్రాంతి సందర్భంగా గురువారం ఈ సినిమా టీజర్ విడుదల కాబోతోంది. టీజర్‌తో పాటు సినిమా విడుదల తేదీపై కూడా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Advertisement
Advertisement
Advertisement