ఉపమాక సర్పంచ్‌ చిన్నా ఆకస్మిక మృతి

ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST

ఉపమాక సర్పంచ్‌ గొన గాల చిన్నా (40) బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు.

ఉపమాక సర్పంచ్‌ చిన్నా ఆకస్మిక మృతి
చిన్నా (ఫైల్‌ ఫొటో)


  కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిక ? 

నక్కపల్లి, మే 5: ఉపమాక సర్పంచ్‌ గొన గాల చిన్నా (40) బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఇటీవల ఆయన కరోనా లక్షణాలతో విశాఖలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు.  ఐదు రోజులుగా చికిత్స పొందుతుండడంతో వైరస్‌ లక్షణాలు కూడా తగ్గాయని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ బుధవారం ఉదయం ఆస్పత్రిలోనే  తుదిశ్వాస విడిచారు. దీంతో టీడీపీ నాయకులు, ఉపమాక పంచాయతీ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. గతంలో చిన్నా  తల్లి ఉపమాక ఎంపీటీసీగా పనిచేశారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. మాజీ ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, చెంగల వెంకట్రావ్‌, టీడీపీ నాయకులు కొప్పిశెట్టి కొండబాబు, కొప్పిశెట్టి వెంకటేశ్‌, బుజ్జి, కురందాసు నూకరాజు, దేవర సత్యనారాయణ ఉపమాక ఉప సర్పంచ్‌ ప్రగడ వీరబాబు, కొప్పిశెట్టి జగదీశ్వరరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-05T05:30:00+05:30 IST