Jun 23 2021 @ 11:06AM

ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం ఉపాస‌న ముంద‌డుగు

మెగాప‌వ‌ర్‌స్టార్ స‌తీమ‌ణి, అపోలో హాస్పిట‌ల్స్ డైరెక్ట‌ర్ ఉపాస‌న కొణిదెల ఇప్పుడు అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. వివ‌రాల్లోకెళ్తే.. వ‌ర‌ల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇండియా అసోసియేష‌న్‌ త‌ర‌పున ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోస్ కార్య‌క్ర‌మానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉపాస‌న నియ‌మితులైన‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. దీనిపై ఉపాస‌న కొణిదెల స్పందిస్తూ ‘‘ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఫ్రంట్ లైన్ వారియర్స్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. మ‌రోవైపు అడవుల్లో వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు అట‌వీ క్షేత్ర సిబ్బంది క‌ఠిన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో రాత్రింబ‌గ‌ళ్లు ప‌నిచేస్తున్నారు. అడవుల్లో పెట్రోలింగ్ చేయడానికి సగటున రోజుకు 15-20 కిలోమీటర్ల వరకు నడుస్తూ, అడవి జంతువులను లేదా వేటగాళ్ళను ఎదుర్కొనే ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. అలాంటి ఫారెస్ట్ ఫ్రంట్ లైన్ హీరోల రాయ‌బారిగా ప‌నిచేయ‌డానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.