యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా

ABN , First Publish Date - 2021-05-13T20:31:08+05:30 IST

యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం..

యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా

న్యూఢిల్లీ: యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్ 27 ప్ర్రిలిమినరీ పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. దేశంలో కోవిడ్ సెకెండ్ వేవ్ నడుస్తుండటం, కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు యూపీఎస్‌సీ ప్రకటించింది. అక్టోబర్ 10న పరీక్షలు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. ఏటా ఐఏఎస్, ఐఎఫ్ఎశ్, ఐపీఎస్ అధికారుల ఎంపక  కోసం మూడు దశల్లో సివిల్ సర్వీసెస్ పరీక్షలను యూపీఎస్‌సీ నిర్వహిస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూలుగా ఈ మూడు దశలు ఉంటాయి.

Updated Date - 2021-05-13T20:31:08+05:30 IST