కోవిడ్-19: యూపీఎస్‌ఆర్టీసీ రూ. 2.47 కోట్ల విరాళం

ABN , First Publish Date - 2020-04-02T22:14:12+05:30 IST

కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (యూపీఎస్ఆర్టీసీ) తనవంతుగా సీఎం విపత్తు...

కోవిడ్-19: యూపీఎస్‌ఆర్టీసీ రూ. 2.47 కోట్ల విరాళం

లక్నో: కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (యూపీఎస్ఆర్టీసీ) తనవంతుగా సీఎం విపత్తు సహాయ నిధికి రూ. 2.47 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా యూపీఎస్ఆర్టీసీ ఎండీ రాజ్ శేఖర్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్‌-19పై ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యల కోసం యూపీఎస్ఆర్టీసీలోని రెగ్యులర్ ఉద్యోగులంతా తమ ఒక రోజు జీతాన్ని (రూ.2.47 కోట్లు) సీఎం విపత్తు సహాయ నిధికి విరాళంగా అందజేశారు. సిబ్బందిని అభినందించి దీన్ని స్వీకరించినందుకు సీఎం గారికి కృతజ్ఞతలు..’’ అని పేర్కొన్నారు. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్ కుమార్ సింగ్‌తో కలిసి రాజ్ శేఖర్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఇవాళ చెక్కును అందజేశారు. కాగా ప్రజా ప్రయోజనార్థం యూపీఎస్ఆర్టీసీలోని ఉద్యోగులంతా స్వచ్ఛందంగా ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చినందుకు రాజ్‌ శేఖర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలంతా కలిసికట్టుగా కోవిడ్-19 జయించాలని ఆయన ఆకాంక్షించారు. 

Updated Date - 2020-04-02T22:14:12+05:30 IST