కార్పొరేట్‌ బ్యాంక్‌లకు ధీటుగా గుడివాడ అర్బన్‌ బ్యాంక్‌ సేవలు

ABN , First Publish Date - 2022-07-10T07:50:02+05:30 IST

కార్పొరేట్‌ బ్యాంకులకు ధీటుగా గుడివాడ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఖాతాదారులు, రైతులకు మెరుగైన సేవలందిస్తోందని బ్యాంక్‌ చైర్మన్‌ పిన్నమనేని పూర్ణవీరయ్య(బాబ్జీ) పేర్కొన్నారు.

కార్పొరేట్‌ బ్యాంక్‌లకు ధీటుగా   గుడివాడ అర్బన్‌ బ్యాంక్‌ సేవలు

 చైర్మన్‌ పిన్నమనేని బాబ్జీ

 గుడివాడ టౌన్‌, జూలై 9 : కార్పొరేట్‌  బ్యాంకులకు ధీటుగా గుడివాడ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఖాతాదారులు, రైతులకు మెరుగైన సేవలందిస్తోందని బ్యాంక్‌ చైర్మన్‌ పిన్నమనేని పూర్ణవీరయ్య(బాబ్జీ) పేర్కొన్నారు. ది గుడివాడ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ 108వ మహాజనసభ శనివారం బ్యాంక్‌ కార్యాలయంలో జరిగింది. బాబ్జీ మాట్లాడుతూ 2021- 22 సంవత్సరంలో బ్యాంక్‌ డిపాజిట్లు రూ.162 కోట్లకు చేర గా రూ.107 కోట్ల రుణాలిచ్చామన్నారు. అతి తక్కువ వడ్డీ రేటుపై అన్ని రకాల రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు.  2021-22 సంవత్సరానికి బ్యాంక్‌ నికర లాభం రూ.1.66 కోట్లు ఆర్జించిందన్నారు. సభ్యుల వాటా ధనంపై 10 శాతం డివిడెండ్‌ చెల్లించేందుకు మహాజన సభ ఆమోదించిందన్నారు. బ్యాంక్‌ డైరెక్టర్లు అబ్దుల్‌ రహీం, సానా భోగేశ్వరరావు, శంభంగి రంగారావు, రావులకొల్లు సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఆళ్ల శ్రీనివాసరావు, బ్యాంక్‌ సీఈవో టి.ఎ్‌స.ఎ్‌స.ఆర్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-10T07:50:02+05:30 IST