రూ.60 లక్షలతో పట్టణ అభివృద్ధి

ABN , First Publish Date - 2021-06-18T05:23:49+05:30 IST

మేజర్‌ పంచాయతీ పాయకరావుపేటలోని అన్ని వార్డుల్లో సుమారు రూ.60 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాల కవర్గ సభ్యులు తీర్మానం చేశారు.

రూ.60 లక్షలతో పట్టణ అభివృద్ధి
పంచాయతీ పాలకవర్గ సమావేశం జరుగుతున్న దృశ్యం



 పాయకరావుపేట పంచాయతీ పాలకవర్గ సమావేశంలో తీర్మానం

 ఉప సర్పంచ్‌కు ప్రత్యేక స్థానం కోరిన పలువురు సభ్యులు

 నిబంధనల ప్రకారం వీలుకాదన్న స్పర్పంచ్‌ ఉషశ్రీ

 గందరగోళం నడుమ కాసేపు వాయిదా.. అనంతరం ప్రారంభం


పాయకరావుపేట, జూన్‌ 17 : మేజర్‌ పంచాయతీ పాయకరావుపేటలోని అన్ని వార్డుల్లో సుమారు రూ.60 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాల కవర్గ సభ్యులు తీర్మానం చేశారు. గురు వారం సర్పంచ్‌ గారా ఉషశ్రీ అధ్యక్షతన పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ 20 వార్డుల్లో   సభ్యులు గుర్తించిన అభివృద్ధి పనులను సుమారు అరవై లక్షల రూపాయలతో చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తు న్నామన్నారు. అనంతరం అంజెండాలోని అంశాలను సభ్యులు చర్చించి, ఆమోదం తెలిపారు. అంతకుముందు వార్డు సభ్యులు మలిపెద్ది వెంకటరమణ, నారపు రెడ్డి పద్మ, దేవాది మంగాదేవి తదితరులు మాట్లాడుతూ గత పాలకవర్గాలు అనుస రించిన విధంగా ప్రస్తుత పాలకవర్గ సమావేశాల్లో ఉప సర్పంచ్‌కు ప్రత్యేక స్థానం కేటాయించాలని కోరారు. దీనిపై సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్న సర్పంచ్‌ మాట్లాడుతూ నిబంధనల ప్రకా రం వీలుకాదని స్పష్టం చేశారు. దీంతో సభ్యుల మధ్య గందరగోళం నెలకొని, కొది ్దసేపు సమావేశం వాయిదా పడింది. అనంతరం తిరిగి పాలకవర్గ సమావేశం జరిగింది. ఉప సర్పంచ్‌ జగతా భవానీతో పాటు పలువురు వార్డు సభ్యులు, పంచా యతీ ఈవో ఎంఎస్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T05:23:49+05:30 IST